న్యూఢిల్లీ: శ్రీలంక మాజీ బౌలర్ చామిండ వాస్(Chaminda Vaas) మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ఈ సారి బౌలింగ్ కోచ్ రూపం దరించనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం డీసీ జట్టు పూర్తిగా ప్రిపేరవుతోంది. శ్రీలంక జాతీయ జట్టులో అత్యుత్తమ కెరీర్ కలిగిన బౌలర్గా వాస్కు పేరున్నది. 111 టెస్టుల్లో 355, వన్డేల్లో 400 వికెట్లు తీశాడతను. గత రెండు సీజన్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మునాఫ్ పటేల్ బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. అయితే మునాఫ్ స్థానంలో వాస్ రానున్నాడు.
వరల్డ్ కప్ విన్నర్, శ్రీలంక బెస్ట్ బౌలర్.. వెల్కమ్ టు టైగర్ టెరిటరీ అని డీసీ తన ఎక్స్లో పోస్టు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రధాన కోచ్గా సౌరవ్ గంగూలీ, బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్ కూడా బాధ్యతలు నిర్వర్తించనున్న విషయం తెలిసిందే. డీసీ జట్టు ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు, 2020 సీజన్లో మాత్రం ఆ జట్టు ఫైన్ చేరింది. జీఎంఆర్ గ్రూపు, జేఎస్డబ్ల్యూ గ్రూపు ఆ జట్టు ఓనర్లుగా ఉన్నారు.
One legendary C.V.
Welcoming our Fast Bowling Coach Chaminda Vaas to Dilli
https://t.co/m5Qrg1EXJ4
— Delhi Capitals (@DelhiCapitals) October 17, 2026





https://t.co/m5Qrg1EXJ4



