☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కేతన్ అగర్వాల్ హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు

పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కోర్టులో దాదాపు 5,300 పేజీల భారీ ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. హత్య ప్రణాళిక, కుట్రకు సంబంధించిన కీలక అంశాలను ఇందులో పొందుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ మాజీ ప్రియుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సియా గోయల్ పదో తరగతి చదువుతున్న సమయంలోనే ఓ ప్రేమ వ్యవహారం నడిపింది. ఆ తర్వాత ఆమె చేతన్‌తో ప్రేమలో పడింది. దీంతో […] The post కేతన్ అగర్వాల్ హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు appeared first on Adya News Telugu.
కేతన్ అగర్వాల్ హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు

పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కోర్టులో దాదాపు 5,300 పేజీల భారీ ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. హత్య ప్రణాళిక, కుట్రకు సంబంధించిన కీలక అంశాలను ఇందులో పొందుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ మాజీ ప్రియుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

సియా గోయల్ పదో తరగతి చదువుతున్న సమయంలోనే ఓ ప్రేమ వ్యవహారం నడిపింది. ఆ తర్వాత ఆమె చేతన్‌తో ప్రేమలో పడింది. దీంతో మొదటి ప్రియుడు ఆమెకు దూరమయ్యాడు. అయితే కేతన్ హత్య కేసులో చేతన్ పేరు తెరపైకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పాత ప్రియుడు పోలీసులను సంప్రదించి కీలక వివరాలు వెల్లడించాడు.

ఛార్జిషీట్‌లో మరో దిగ్భ్రాంతికర విషయం బయటపడింది. మొదట కేతన్‌ను చంపాలని వారు భావించలేదు. కేవలం అతని కాళ్లు, చేతులు విరగ్గొట్టాలని సియా, చేతన్ ప్లాన్ చేశారు. ఇందుకోసం కేతన్‌ను వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని ఓ స్నేహితుడి సహాయం కోరారు. అయితే అతడు ఈ దుశ్చర్యను తీవ్రంగా వ్యతిరేకించాడు. పిచ్చి పనులను మానుకోవాలని హెచ్చరించాడు. పోలీసులు ఆ స్నేహితుడి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.

మరోవైపు కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ పలు భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. నిశ్చితార్థం సమయంలో సియాకు రూ. 80 లక్షల విలువైన ఆభరణాలు ఇచ్చామని తెలిపారు. దాంతో పాటు రూ. 8 లక్షల విలువైన దుస్తులను కూడా కొనిచ్చామన్నారు. కుమారుడి పెళ్లిని ఘనంగా జరపాలని ఎన్నో కలలు కన్నామని వాపోయారు. ప్రస్తుతం ఈ ఛార్జిషీట్ వివరాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

The post కేతన్ అగర్వాల్ హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← క్రేజీ అప్‌డేట్.. ఓటీటీలోకి మెగాస్టార్!కాకుమాను కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com