☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Kolkata Stampede | ‘తొక్కిస‌లాట ఎలా జ‌రిగింది’.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన‌ కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video

Kolkata Stampede | ప‌శ్చిమ‌బెంగాల్ (West Bengal) రాజ‌ధాని కోల్‌క‌తా (Kolkata) లో జ‌రిగిన తొక్కిస‌లాట (Stampede) ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డి స్థానిక‌ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ ఉద‌యం కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah), ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి (West Bengal CM) సువేందు అధికారి (Su) ప‌రామ‌ర్శించారు.
Kolkata Stampede | ‘తొక్కిస‌లాట ఎలా జ‌రిగింది’.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన‌ కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video

Kolkata Stampede : ప‌శ్చిమ‌బెంగాల్ (West Bengal) రాజ‌ధాని కోల్‌క‌తా (Kolkata) లో జ‌రిగిన తొక్కిస‌లాట (Stampede) ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డి స్థానిక‌ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ ఉద‌యం కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah), ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి (West Bengal CM) సువేందు అధికారి (Su) ప‌రామ‌ర్శించారు. బాధితుల‌తో మాట్లాడి ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌ని ఆరా తీశారు. ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అండ‌గా ఉంటాయ‌ని వారికి భ‌రోసా ఇచ్చారు. అదేవిధంగా ఘ‌ట‌నా ప్రాంతానికి వెళ్లి ప‌రిశీలించారు. అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

కాగా శ‌నివారం రాత్రి 7.40 గంట‌ల స‌మ‌యంలో పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని చోర్‌బగాన్‌ సర్బజనీన్‌ దుర్గా మండపంవద్ద తొక్కిసలాట జ‌రిగింది. ఈ ఘటనలో అక్క‌డిక‌క్క‌డే 17 మంది మృతిచెందారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మ‌రో 35 మంది గాయ‌ప‌డ్డారు. చికిత్స పొందుతూ మ‌రో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోవ‌డంతో మృతుల సంఖ్య 19కి చేరింది. గాయ‌ప‌డిన వారంతా ప్ర‌స్తుతం వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మృతుల కుటుంబాల‌కు, క్ష‌త‌గాత్రులకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాయి. కేంద్రం మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున, క్ష‌త‌గాత్రుల‌కు రూ.50 వేల చొప్పున‌ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది. అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మృతుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌ల చొప్పున‌, గాయ‌ప‌డిన వారికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక‌సాయం అందజేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. మృతుల కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇస్తామ‌ని, గాయ‌ప‌డిన వారి చికిత్సకు అయ్యే మొత్తం ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని తెలిపింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com