☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారు.. ఊరి పేరు మార్చేశారు.. కోనాయిపల్లికి బదులు కోనాపూర్‌!

Smart Ration Cards | కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా మారాయి. కార్డుల్లో గ్రామం పేరును కోనాయిపల్లికి బదులు కోనాపూర్ అని ప్రింట్ చేశారు.
Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారు.. ఊరి పేరు మార్చేశారు.. కోనాయిపల్లికి బదులు కోనాపూర్‌!

Smart Ration Cards | దౌల్తాబాద్, సెప్టెంబర్ 26: కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా మారాయి. కార్డుల్లో ఏకంగా గ్రామం పేరే తప్పుగా ముద్రించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టగా.. పలువురు కార్డుల్లో కోనాయిపల్లికి బదులు కోనాపూర్ అని నమోదైంది.

ప్రభుత్వ పథకాలకు కీలకమైన రేషన్‌ కార్డుల్లో గ్రామం పేరు తప్పుగా ఉండటంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్డుల ముద్రణ, పంపిణీకి ముందే లబ్ధిదారుల వివరాలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉండగా.. కనీసం గ్రామం పేరు కూడా సరిగ్గా లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తప్పులున్న రేషన్‌ కార్డులను ఉపయోగించే సమయంలో భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పేర్లు, చిరునామా, గ్రామం వంటి వివరాలను సరిచూసిన తర్వాతే కార్డులను పంపిణీ చేయాల్సిందని పేర్కొన్నారు.

ఈ విషయంపై సర్పంచ్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కోనాయిపల్లి గ్రామానికి బదులుగా కోనాపూర్‌గా నమోదైన కార్డుల వివరాలను వెంటనే సరిచేసి లబ్ధిదారులకు సరైన కార్డులు అందించాలని కోరారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లోని వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పంపిణీ చేయాలని సూచించారు. తప్పుల కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← శ్రీరంగనాథ స్వామి ఆలయంలో చోరీ.. రాములవారి గుడిలో పంచలోహ విగ్రహాలు మాయంKhairatabad By-Election : బీఆర్ఎస్‌కు ఇజ్జత్‌ కా సవాల్‌గా ఖైరతాబాద్ బైపోల్.. అభ్యర్థిగా అతనేనా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com