☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు..పెను ప్రమాదం తప్పింది..!

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు..పెను ప్రమాదం తప్పింది..!
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు..పెను ప్రమాదం తప్పింది..!
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు..పెను ప్రమాదం తప్పింది..!

ఏపీలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విజయవాడలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గురువారం ( సెప్టెంబర్ 24 ) రాత్రి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోసం రోడ్డు మరమ్మత్తుల కోసం ముందస్తు నిర్ణయంతో ఘాట్ రోడ్డు మూసివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.​ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ శుక్రవారం అధికారులతో కలిసి స్వయంగా ఘాట్ రోడ్డులోని ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. కొండపై నుండి ఘాట్ రోడ్డుపై జారిపడిన భారీ బండరాళ్లు, రాతిపెళ్లలు, మట్టిని వెంటనే పొక్లెయిన్లు, క్రేన్ల సహాయంతో యుద్ధప్రాతిపదికన తొలగించి మార్గాన్ని శుభ్రం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

​కొండచరియల పై వర్షపు నీటి ఊట కారణంగా మట్టి నానిపోయి ఉందని.. ఇంకా ఎక్కడైనా కొండచరియలు జారే అవకాశాలు ఉన్నాయా అనే అంశాన్ని సాంకేతిక నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రమాదకరంగా ఉన్న వదులైన రాళ్లను ముందుగానే గుర్తించి నియంత్రిత పద్ధతిలో తొలగించాలని అధికారులకు సూచించారు. ఘటనాస్థలంలో రిటైనింగ్ వాల్, ఐరన్ ఫెన్సింగ్ రాక్-ఫాల్ నెట్లను మరింత పటిష్టంగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.

ఘాట్ రోడ్డు పూర్తిగా పునరుద్దరించేవరకు అటువైపుకు ఎవరినీ అనుమతించొద్దని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← జ్యోతిష్యం: పౌర్ణమి వేళ తులారాశిలో బుధుడు, శుక్రుడు.. కర్కాటకంలో గురుడు.. ఎవరికిలాభం.. ఎవరికి నష్టం.. 12 రాశుల ఫలితాలు ఇవే..!2 గోల్డ్.. 8 సిల్వర్.. 9 బ్రాంజ్.. ఆసియా గేమ్స్‌లో భారత్ మెడల్స్ పూర్తి లిస్ట్ ఇదే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com