☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

2 గోల్డ్.. 8 సిల్వర్.. 9 బ్రాంజ్.. ఆసియా గేమ్స్‌లో భారత్ మెడల్స్ పూర్తి లిస్ట్ ఇదే!

2 గోల్డ్.. 8 సిల్వర్.. 9 బ్రాంజ్.. ఆసియా గేమ్స్‌లో భారత్ మెడల్స్ పూర్తి లిస్ట్ ఇదే!
2 గోల్డ్.. 8 సిల్వర్.. 9 బ్రాంజ్.. ఆసియా గేమ్స్‌లో భారత్ మెడల్స్ పూర్తి లిస్ట్ ఇదే!
2 గోల్డ్.. 8 సిల్వర్.. 9 బ్రాంజ్.. ఆసియా గేమ్స్‌లో భారత్ మెడల్స్ పూర్తి లిస్ట్ ఇదే!

Asian Games 2026 Medal Tally: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు (Asian Games 2026) రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 19న అట్టహాసంగా ప్రారంభమైన ఈ 20వ ఎడిషన్ మహా క్రీడా వేడుకలో భారత్ తరఫున దాదాపు 500 మంది అథ్లెట్లు పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగారు. మొత్తం 43 క్రీడలు, 71 విభాగాల్లో 469 స్వర్ణ పతకాల కోసం పోటీలు జరుగుతున్నాయి. గత హంగ్జౌ 2023 గేమ్స్‌లో రికార్డు స్థాయిలో 106 పతకాలతో అదరగొట్టిన ఇండియా, ఈసారి కూడా పతకాలే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంది.

భారత్ సాధించిన పతకాలు ఇవే:

ఐచి-నగోయా ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 19 పతకాలు (2 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలు) సాధించి పతకాల పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా షూటింగ్ విభాగం భారత్‌కు పతకాల వరంలా మారింది. మొత్తం 19 పతకాలలో ఒక్క షూటింగ్ నుంచే 10 పతకాలు రావడం విశేషం.

సరికొత్త రికార్డులు.. పతకాలతో జోరు:

* మహిళల క్రికెట్ జట్టు: శ్రీలంకను ఓడించి గోల్డ్ మెడల్ సాధించి భారత్‌కు ఈ టోర్నీలో తొలి స్వర్ణాన్ని అందించింది.
* కమల్‌జిత్ - సురుచి సింగ్: మిక్స్‌డ్ టీమ్ 10ఎం ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆసియా రికార్డును సమం చేస్తూ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు.
* మీరాబాయి చాను: మహిళల 49 కేజీల విభాగంలో రజతం నెగ్గి, 1998 బ్యాంకాక్ గేమ్స్ తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు అద్భుతమైన పతకాన్ని అందించింది.
* సుచిక త్రియాల్: మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ట్రెడిషనల్ -60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గి ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ఈ విభాగంలో తొలి పతకాన్ని తెచ్చి పెట్టారు.
* సీమ కుమారి: మహిళల 10,000 మీటర్ల రేసులో కాంస్యం సాధించి, గత 16 ఏళ్లుగా ఉన్న పతక కరువును చెరిపేశారు.
* రోషీబినా దేవి (వుషు), జై మీనా (సాఫ్ట్ టెన్నిస్) కూడా అద్భుత ప్రదర్శనతో పతకం సాధించారు.

పతకాల పట్టికలో చైనాదే అగ్రస్థానం:

ఈ ఆసియా గేమ్స్ టోర్నమెంట్‌లో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. మొత్తం 135 పతకాలతో (85 స్వర్ణాలు, 30 రజతాలు, 20 కాంస్యాలు) చైనా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్ (95), దక్షిణ కొరియా (54) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ 19 పతకాలతో 12వ స్థానంలోనే కొనసాగుతుంది.

ALSO READ : 48– 24తో నేపాల్ చిత్తు: ఫైనల్‌కు చేరిన టీమిండియా.. గోల్డ్‌ మెడల్పై భారత్ నజర్!

ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ మీదే అందరి చూపు:

నీరజ్ చోప్రా గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైనప్పటికీ, భారత్ తరఫున పీవీ సింధు, మను బాకర్, లవ్లీనా బోర్గోహైన్, అమన్ సెహ్రావత్ లాంటి స్టార్ ఒలింపిక్ మెడలిస్టులు బరిలో ఉన్నారు. అంతేకాకుండా, ఈసారి ఆర్చరీ, హాకీ, సెయిలింగ్, స్క్వాష్, సర్ఫింగ్, టెన్నిస్, ట్రయాథ్లాన్ లాంటి 7 ప్రధాన క్రీడల ద్వారా నేరుగా లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ ఛాన్స్ కూడా దొరకనుంది. ట్రయాథ్లాన్ మినహా మిగతా అన్ని విభాగాల్లోనూ భారత్ పోటీ పడుతుండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు, ఒలింపిక్ బెర్త్‌లు ఖాయం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు..పెను ప్రమాదం తప్పింది..!వాట్సాప్‌లో ఒక్క రిప్లై.. క్షణాల్లో అకౌంట్ ఖాళీ: చార్టర్డ్ అకౌంటెంట్‌కు కొత్త సైబర్ మోసం షాక్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com