☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

వాట్సాప్‌లో ఒక్క రిప్లై.. క్షణాల్లో అకౌంట్ ఖాళీ: చార్టర్డ్ అకౌంటెంట్‌కు కొత్త సైబర్ మోసం షాక్

వాట్సాప్‌లో ఒక్క రిప్లై.. క్షణాల్లో అకౌంట్ ఖాళీ: చార్టర్డ్ అకౌంటెంట్‌కు కొత్త సైబర్ మోసం షాక్
వాట్సాప్‌లో ఒక్క రిప్లై.. క్షణాల్లో అకౌంట్ ఖాళీ: చార్టర్డ్ అకౌంటెంట్‌కు కొత్త సైబర్ మోసం షాక్
వాట్సాప్‌లో ఒక్క రిప్లై.. క్షణాల్లో అకౌంట్ ఖాళీ: చార్టర్డ్ అకౌంటెంట్‌కు కొత్త సైబర్ మోసం షాక్

డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతులను ప్రజలను మోసం చేసేందుకు వాడుతున్నారు. ఓటీపీ చెప్పకుండానే, ఎలాంటి లింక్ క్లిక్ చేయకుండానే క్షణాల్లో బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను కాజేస్తూ గుబులు పుట్టిస్తున్నారు. తాజాగా లక్నోకి చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌కు ఎదురైన చేదు అనుభవం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వాట్సాప్‌లో 'NO' అంటూ ఒకే ఒక్క మెసేజ్‌కు రిప్లై ఇచ్చిన ఆయన.. తన ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఖాతాల నుంచి రూ.లక్షా 70వేలు పోగొట్టుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అసలు ఏం జరిగింది? వాట్సాప్ మోసం స్టోరీ
లక్నోకు చెందిన సీఏకు వాట్సాప్‌లో ఒక రోజు అనూహ్యంగా ఒక మెసేజ్ వచ్చింది. ఆయన అకౌంట్ నుంచి రూ.90వేలు కట్ అయినట్లు అందులో ఉంది. ఆ వెంటనే మరో మెసేజ్ కూడా వచ్చింది. అందులో ఒకవేళ ఈ లావాదేవీని మీరు చేయకపోతే 'నో' అని రిప్లై ఇవ్వాలని కోరింది. అది నిజమైన బ్యాంక్ అలర్ట్ అని నమ్మిన అకౌంటెంట్ ఏమాత్రం ఆలోచించకుండా 'నో' అని రిప్లై ఇచ్చాడు. అంతే క్షణాల్లో ఆయనకు అసలు షాక్ తగిలింది. కొద్దిసేపట్లోనే ఆయనకు ఉన్న రెండు వేర్వేరు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.లక్షా 70వేలు మాయమయ్యాయి.
ఎలాంటి ఓటీపీ లేదు, లింక్ లేదు.. అయినప్పటికీ డబ్బులు మాయం అయిపోయాయి.

ఈ కేసులో అత్యంత విచిత్రమైన, ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. బాధితుడు ఎలాంటి అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయలేదు. ఏ ఓటీపీని ఎవరితోనూ పంచుకోలేదు. తన బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఎక్కడా ఎంటర్ కూడా చేయలేదు. అంతేకాదు ఫోన్‌లో ఎలాంటి రిమోట్ యాక్సెస్ అప్లికేషన్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయలేదట. ఇవేవీ లేకుండానే డబ్బులు ఎలా కట్ అయ్యాయనే దానిపై లక్నో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, సైబర్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు రిప్లై ఇవ్వగానే ఆ వాట్సాప్ మెసేజ్‌లో ఉన్న ఏదైనా హిడెన్ మాలీషియస్ కాంపోనెంట్ యాక్టివేట్ అయిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు అధికారులు.

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజల్లో భయాన్ని, ఆందోళనను రేకెత్తించే సరికొత్త 'సోషల్ ఇంజనీరింగ్' వ్యూహాలను వాడుతున్నారు. ఖాతాలో డబ్బులు కట్ అయ్యాయని చెప్పగానే ప్రజలు కంగారుపడి వెంటనే స్పందిస్తారనే బలహీనతను కేటుగాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ ఘటనపై అడిషనల్ డీసీపీ (క్రైమ్) కిరణ్ యాదవ్ మాట్లాడుతూ.. బాధితుడి ఫోన్, వాట్సాప్ యాక్టివిటీ, బ్యాంక్ లావాదేవీలపై ఫోరెన్సిక్ పరీక్షలు జరిపితేనే అసలు టెక్నికల్ మెకానిజం ఏంటో బయటపడుతుందన్నారు.

ఇలా అప్రమత్తంగా ఉండండి..

ఈ తరహా వింత సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని కీలక జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి:

* వాట్సాప్‌లో లేదా ఎస్ఎంఎస్‌లో వచ్చే అనధికారిక డెబిట్ అలర్ట్‌లకు వెంటనే రిప్లై ఇవ్వకండి.
* ఎవరికైనా డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వస్తే.. నేరుగా బ్యాంక్ అధికారిక యాప్, వెబ్‌సైట్లోకి వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.
* మెసేజ్‌లో ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేయడం, వారు చెప్పినట్లు చేయడం లాంటి తప్పులు చేయెుద్దు.
* OTP, పిన్ నంబర్, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.
* ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← 2 గోల్డ్.. 8 సిల్వర్.. 9 బ్రాంజ్.. ఆసియా గేమ్స్‌లో భారత్ మెడల్స్ పూర్తి లిస్ట్ ఇదే!మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com