కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •
25 Sep 2026 • 👁 5
మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు..
మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు..
Link Share opens the selected network with the article URL. Full/Short News shares the JPG + article link through the phone share sheet; on desktop the JPG downloads, the link is copied, and the selected network opens so you can attach the image.
Link copied
మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు..
కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కి బిగ్ షాక్ ఇచ్చింది ఈడీ. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు సమన్లు జారీ చేసింది ఈడీ. రూ.842 కోట్ల మోసం జరిగిందని అంచనా వేస్తున్న ఈడీ సెప్టెంబర్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రా నుంచి రూ.2.1 కోట్లు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు.
మనీలాండరింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఎమ్మెల్యే ఆస్తులపై కూడా దృష్టి పెట్టింది ఈడీ. ఫ్లాట్లు, విల్లాలు నిర్మిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేశారని.. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేదంటూ కొనుగోలుదారుల ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
సాహితి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో తొలుత రూ.248 కోట్లు, తదుపరి దర్యాప్తులో మోసం విలువ సుమారు రూ.842 కోట్లుగా అంచనా వేస్తోంది ఈడీ. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు గుర్తించింది ఈడీ. నిధులను సొంత, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది.సాహితి ఇన్‌ఫ్రా సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావుపై కూడా అభియోగాలు ఉన్నాయి. దాదాపు రూ.126 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఈడీ అంచనా వేస్తోంది.
బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించింది ఈడీ. ఇప్పటివరకు 56 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది ఈడీ. గతంలో రూ.161 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేయగా..మరో విడతలో రూ.12.6 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. సంస్థ ప్రకటనల్లో కనిపించిన నటుడు జగపతిబాబును సైతం సాక్షిగా విచారించింది ఈడీ. ఏ కేసుకు సంస్థ ఎండీ లక్ష్మీనారాయణను 2024 సెప్టెంబర్‌లో అరెస్ట్ చేసింది ఈడీ.