☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

ఆధ్యాత్మికం: కర్ణుడు దానగుణం.. చివరిక్షణం వరకూ పోరాటం.. విశ్వాసం అంటే ఇదే..!

ఆధ్యాత్మికం: కర్ణుడు దానగుణం.. చివరిక్షణం వరకూ పోరాటం.. విశ్వాసం అంటే ఇదే..!
ఆధ్యాత్మికం: కర్ణుడు దానగుణం.. చివరిక్షణం వరకూ పోరాటం.. విశ్వాసం అంటే ఇదే..!
ఆధ్యాత్మికం: కర్ణుడు దానగుణం.. చివరిక్షణం వరకూ పోరాటం.. విశ్వాసం అంటే ఇదే..!

కర్ణుడు అంటే దానం. దానం అంటే కర్ణుడు. నేటికీ కర్ణుడి దానగుణం గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అంటే, ఆయన దానం ఇవ్వడంలో ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. 'కర్ణుడు నిజంగా అంతటి దానకర్ణుడా?' అని స్వయంగా తానే పరిశీలించాలని అనుకుంటాడు కృష్ణుడు.

కృష్ణుడు వెళ్లేసరికి కర్ణుడు అభ్యంగ స్నానానికి (ఆయిల్ బాత్) రెడీ అవుతూ తలకి నూనె రాసుకుంటూ ఉంటాడు. ఎడమ వైపు రత్నాలు పొదిగిన నూనె గిన్నె ఉంటుంది. కుడి చేతితో నూనె పెట్టుకుంటూ ఉంటాడు. కృష్ణుడి చూపు నూనె గిన్నె మీద పడింది. 'కర్ణా..ఆ గిన్నె ఎంతో బాగుంది. నాకిస్తావా?" అంటాడు. కర్ణుడు క్షణం కూడా ఆలోచించకుండా ఎడమ చేతితో గిన్నె తీసి, "తీసుకో కృష్ణా' అని ఇస్తాడు.

'కర్ణా ఎడమ చేతితో దానం చేయటం మంచిది కాదని నీకు తెలియదా?' అని అభ్యంతరం చెప్తాడు కృష్ణుడు. దానికి కర్ణుడు కృష్ణా నా కుడిచేతితికి నూనె ఉంది. చేయి శుభ్రం చేసుకొని వచ్చి కుడిచేతితో నీకు గిన్నె ఇచ్చే లోపు ఏమైనా జరగొచ్చు. నా ప్రాణాలే పోవచ్చు. లేదా నా ఆలోచన మారిపోవచ్చు. అందుకే అలాంటిదేం జరగకుండా వెంటనే నూనె గిన్నె ఇచ్చేశాను. అంతేగానీ ఎడమ చేతితో దానం ఇవ్వకూడదనే విషయం తెలియక కాదు' అంటాడు. 'ఆహా! దానశీలతలో కర్ణుడిని మించిన వారు లేరు' అని శ్రీకృష్ణుడు సంతోషపడతాడు. ఈ విషయంలోనే కాదు.. అడుగడుగునా కష్టాలు ఎదుర్కొన్న కర్ణుడు మనకు చాలా విషయాల్లో ఇన్సిపిరేషన్ గా ఉంటాడు.

కుంతీపుత్రుడు

భారతంలోని గొప్ప వీరుల్లో కర్ణుడు ముందు ఉంటాడు. దూర్వాస మహర్షి కుంతికి 'నువ్వు ఏ దేవుడి అంశతోనైనా బిడ్డలను కనొచ్చు' అనే వరం ఇస్తాడు. ఆ వరాన్ని పరీక్షించడానికి ముందుగా సూర్యుడిని కోరుకుంటుంది.

అలా ఆమెకు పెళ్లి కాకముందే సూర్యుడి అంశతో సూర్యతేజస్సు, -సహజ కవచకుండలాలు కలిగిన కర్ణుడు పుడతాడు.. పెళ్లికాకముందే బిడ్డ పుట్టాడని లోకం నిందలు వేస్తుందని భయపడి... కర్ణుడిని ఓ తొట్టెలో ఉంచి నదిలో వదిలిపెడుతుంది కుంతి. ఆ తొట్టె అతిరథుడు అనే సూతుడికి దొరుకుతుంది. అతిరథుడు, రాధా దంపతులకు సంతానం లేకపోవడంతో ప్రేమతో పెంచుకుంటారు.

విద్యావంతుడు

సూతపుత్రుడు యుద్ధ విద్యలు నేర్చుకోవద్దనే ఆంక్షలు ఉండటంతో కసితో యుద్ధ విద్య నేర్చుకోవాలనుకుంటాడు. ద్రోణుడు సహా ఎంతోమంది గురువుల దగ్గర 'సూతపుత్రుడు' అనే అవమానాలు పొందుతాడు.చివరికి పరుశురాముడికి తాను బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పి ఆయన దగ్గర విద్యలు నేర్చుకుంటాడు. అలా మహాభారతంలో అర్జునుడంత గొప్పవీరుడు ఎవరైనా ఉన్నారా? అంటే 'కర్ణుడే' అన్నంతగా విలువిద్యలో రాటుదేలుతాడు.

కౌరవ పొందవులు ద్రోణుడి దగ్గర సకల విద్యలు నేర్చుకున్న తర్వాత.. హస్తినాపురంలో వాళ్ల నైపుణ్యాల్ని ప్రదర్శించడానికి ఉత్సవం నిర్వహిస్తారు.. 'అర్జునుడిని మించిన విలుకాడు లేడు ' అని ద్రోణుడు చెప్పిన క్షణాల్లోనే కర్ణుడు ప్రత్యక్షమవుతాడు.

'అర్జునుడితో యుద్ధం చేసి ఓడిస్తాను' అంటాడు. కానీ, "క్షత్రియుడివి కాదు కాబట్టి, నీకు ఈ పోటీకి అనుమతి లేదు' అని భీష్ముడు ప్రకటిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు అంగరాజ్యానికి రాజుగా చేసి.. అతడ్ని స్నేహితుడిగా మార్చుకుంటాడు. అలా వీళ్లిద్దరూ స్నేహానికే పర్యాయపదం అనిపించుకుంటారు.

శాపాలు..

పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకుంటుండగా... ఒకనాడు పరశురాముడు కర్ణుడి తొడపై తలవాల్చి నిద్రపోతాడు. అప్పుడే ఒక పురుగు వచ్చి కర్ణుడి తొడను తొలుస్తుంది. రక్తం కారి ఆ తడి... పరశురాముడి తలకు తగలడంతో మేల్కొంటాడు. ఆ రక్తధారలు చూసి కర్ణుడు పుట్టుకను గ్రహిస్తాడు. దాంతో 'మోసంతో సంపాదించిన విద్య అత్యవసర సమయంలో నీకు గుర్తుకురాదు' అని శపిస్తాడు.

పరశురాముడి దగ్గర విద్య నేర్చుకొని వస్తుండగా తన విద్యల్ని పరీక్షించుకోవాలని గాల్లోకి ఒక బాణం వదులుతాడు. అది వెళ్లి ఓ బ్రాహ్మణుడి ఆవుకు తగలడంతో చనిపోతుంది. దాంతో 'ఆపత్కాలంలో నీ రథం భూమిలోకి కుంగిపోతుంది' అని శపిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఇలాంటి శాపాలకు ఆక్షణంలో బాధపడినా జీవితంలో కర్ణుడు ఎక్కడా కుంగిపోలేదు.

కర్ణుని ఔదార్యం

కర్ణుడి శక్తి.. అర్జునుడికి కీడుగా భావిస్తాడు. ఇంద్రుడు. తన అంశతో పుట్టిన అర్జునుడిని కాపాడటానికి ఇంద్రుడు... మారువేషంలో వెళ్లి తన కవచకుండలాలు దానం ఇవ్వమని అడుగుతాడు. తన ప్రాణానికి ముప్పు అని తెలిసినా.. కవచకుండలాలు దానం చేస్తాడు కర్ణుడు.

మహాభారత యుద్ధం టైమ్​ లో అతని దగ్గరకు కుంతి వస్తుంది. కర్ణుడి జన్మ రహస్యం చెప్పి.. తమ్ముళ్లైన పాండవులతో కలవమని కోరుతుంది. దానికి కర్ణుడు. ఒప్పుకోడు. 'అర్జునుడిని తప్ప పాండవుల్లో ఎవరినీ చంపను. అర్జునుడో, కర్ణుడో.. ఇద్దరిలో ఏ ఒక్కరు చనిపోయినా నీకు పంచపాండవులే ఉంటారు' అని కుంతికి మాటిస్తాడు. భీష్ముడు కర్ణుడిని సూతపుత్ర అని తిట్టినందుకు.. భీష్ముడు నేలకొరిగిన తర్వాతే రణభూమిలో అడుగుపెడతాడు కర్ణుడు. అలా ఎన్నో అవమానాల్ని భరిస్తూ.. ఎన్నో కష్టాల్ని ఓర్చుకుంటూ జీవితంలో చివరిక్షణం వరకూ పోరాడి చనిపోతాడు కర్ణుడు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← తాత వయసున్న వ్యక్తితో 30 ఏళ్ల యువతి ప్రేమ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట..పరుగుల ప్రపంచంలో విషాదం.. రేసు చివరి 500 మీటర్లలో కుప్పకూలి 25 ఏళ్ల యువతి మృతి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com