Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ ఓ మహిళ ప్రాణాన్ని బలిగొంది. రెండు థార్ కార్లతో రేసింగ్ చేస్తూ బైక్ను ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద ఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. షాకీర్ తన భార్య షహానా బేగం (40), కుమార్తె ఆయారాతో కలిసి బంధువు వివాహానికి వెళ్లి బైక్పై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అమిస్తాపూర్ యూపీఎస్ పాఠశాల సమీపంలో రెండు థార్ కార్లతో రేసింగ్ చేస్తున్న యువకులు వారి బైక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో షహానా బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో షాకీర్కు కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తల్లి ఒడిలో ఉన్న చిన్నారి ఆయారాకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే రెండు కార్లలో ఒకటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరో కారును స్థానికులు వెంబడించి పట్టుకున్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వారిపై దర్యాప్తు చేపట్టారు.యువకుల రేసింగ్ సరదా ఓ కుటుంబంలో విషాదాన్ని నింపడంతో స్థానికంగా ఆవేదన వ్యక్తమవుతోంది. రహదారులపై నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహిళ ప్రాణాలు తీసిన యువకుల రేసింగ్ సరదా
రెండు థార్ కార్లతో రేసింగ్ చేస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన యువకులు
ప్రమాదంలో బైక్పై ఉన్న మహిళ మృతి, కాళ్లు చేతులు విరిగి మహిళ భర్త పరిస్థితి విషమం
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ యూపీఎస్ స్కూల్ వద్ద కార్లతో రేసింగ్ చేస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన యువకులు
ప్రమాదంలో బంధువు పెళ్లికి వెళ్లి భర్త షాకీర్, కూతురు ఆయారాతో కలిసి వస్తున్న షహానా బేగం (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి
కాళ్లు చేతులు విరిగి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాకీర్, తల్లి ఒడిలో ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ చిన్నారి ఆయారా
రేసింగ్కు పాల్పడిన రెండు కార్లలో ఒక కారు వెళ్లిపోగా, మరో కారును వెంబడించి పట్టుకున్న స్థానికులు
ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) October 17, 2026






