☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

తిరుపతిలో సినీ ఫక్కీలో చోరీ.. అందరూ చూస్తుండగానే.. 60 గ్రాముల బంగారు నగల పెట్టెతో పరార్

తిరుపతిలో సినీ ఫక్కీలో చోరీ.. అందరూ చూస్తుండగానే.. 60 గ్రాముల బంగారు నగల పెట్టెతో పరార్
తిరుపతిలో సినీ ఫక్కీలో చోరీ.. అందరూ చూస్తుండగానే.. 60 గ్రాముల బంగారు నగల పెట్టెతో పరార్
తిరుపతిలో సినీ ఫక్కీలో చోరీ.. అందరూ చూస్తుండగానే.. 60 గ్రాముల బంగారు నగల పెట్టెతో పరార్

తిరుపతిలో ఓ బ్యాంకులో చోరీ కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే అత్యంత చాకచక్యంగా ఓ గుర్తుతెలియని వ్యక్తి సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టెను ఎత్తుకెళ్లాడు. చేతిలో ఉన్న పేపర్‌ను అడ్డుగా పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా నగల పెట్టెతో బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాలలో ఉన్న ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ గతంలో బ్యాంకులో తాకట్టు పెట్టిన తన బంగారు ఆభరణాలను రెన్యూవల్ చేసేందుకు బ్యాంకుకు వచ్చారు. ఆమె రసీదును పరిశీలించిన బ్యాంకు అప్రైజర్.. నగల బాక్స్‌ను లోపలి నుంచి తీసుకొచ్చి బయట ఉంచారు.రెన్యూవల్ ప్రక్రియలో భాగంగా అప్రైజర్ మరోసారి బ్యాంకులోపలికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తి నగల పెట్టెను అపహరించాడు.

పేపర్ అడ్డుగా పెట్టి.. నగల పెట్టెతో పరారీ

నిందితుడు తన చేతిలో ఉన్న పేపర్‌ను నగల బాక్స్‌పై ఉంచాడు. పేపర్‌తో పాటు నగల పెట్టెను తీసుకున్నాడు. అక్కడున్న వారికి ఎలాంటి అనుమానం రాకుండా సాధారణంగా బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోయాడు.కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన అప్రైజర్‌కు నగల బాక్స్ కనిపించలేదు. దీంతో బ్యాంకులో కలకలం రేగింది. అక్కడున్న వారిని ఆరా తీసిన అనంతరం సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా చోరీ జరిగిన విషయం బయటపడింది.

చోరీకి గురైన పెట్టెలో సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో బంగారు గొలుసు, నెక్లెస్‌తో పాటు మూడు ఉంగరాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు సీఐ మద్దయ్య చారి తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ఫైనాన్షియల్ చీఫ్ హతంసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.28.94 కోట్లు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com