☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

మారుతి మాస్టర్ ప్లాన్.. హర్యానాలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్.. ఇక పొగ, కాలుష్యానికి చెక్

మారుతి మాస్టర్ ప్లాన్.. హర్యానాలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్.. ఇక పొగ, కాలుష్యానికి చెక్
మారుతి మాస్టర్ ప్లాన్.. హర్యానాలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్.. ఇక పొగ, కాలుష్యానికి చెక్
మారుతి మాస్టర్ ప్లాన్.. హర్యానాలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్.. ఇక పొగ, కాలుష్యానికి చెక్

హర్యానాలోని మనేసర్‌లో మారుతి సుజుకి సంస్థ దాని తయారీ కేంద్రంలో 300 కిలోవాట్ల పైలట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. అయితే ఈ ప్లాంట్‌లో తయారుచేసే గ్రీన్ హైడ్రోజన్‌ను నేచురల్ గ్యాస్ తో కలిపి, కార్ల తయారీ ప్రాసెస్‌లో ఇంధనంగా ఉపయోగిస్తారు. అయితే ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఈ సిస్టమ్ దోహదపడుతుంది.

ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే అనుభవాలతో హర్యానా, గుజరాత్‌లోని మిగతా అన్ని తయారీ కేంద్రాల్లోకి కూడా ఈ 'గ్రీన్ హైడ్రోజన్' సాంకేతికతను విస్తరించాలని మారుతి యోచిస్తోంది.

కంపెనీ సూత్రం ఏంటంటే
సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రధాన తత్వమైన 'షో-షో-కే-టాన్-బి' (అంటే చిన్నది, తక్కువ, తేలికైనది, పొట్టిది ఇంకా మరింత అందమైనది) నుండి స్ఫూర్తి పొంది, వనరులను పొదుపుగా వాడుతూ ఇంధన అవసరాలను ఆప్టిమైజ్ చేస్తూనే ఉన్నామని మారుతి సుజుకి తెలిపింది.

కంపెనీ ఎండీ & సీఈఓ ఏమన్నారంటే
"కార్ల తయారీలో వివిధ రకాల పర్యావరణ రహిత మార్గాలను అనుసరిస్తున్నట్లే, ఇంధనం కోసం కూడా స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధన మార్గాలను ఎంచుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'గ్రీన్ హైడ్రోజన్ మిషన్'కు మద్దతుగా ఈ ప్లాంట్‌ను ప్రారంభించాం." అని అన్నారు.

అలాగే "సోలార్, బయోగ్యాస్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ద్వారా పర్యావరణానికి మేలు చేసే సాంకేతికతలను పెంచుతున్నాం. 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి మా తయారీ కేంద్రాల నుండి వెలువడే కార్బన్ ఉద్గారాలను ప్రస్తుత 6,15,000 టన్నుల నుండి 2,66,000 టన్నులకు తగ్గించడమే మా లక్ష్యం." అని చెప్పారు.

ALSO READ : అక్టోబర్ 2న "No UPI Day"

త్వరలో మరో బయోగ్యాస్ ప్లాంట్
దీనికి తోడు, హర్యానాలోని ఖర్ఖోడా ప్లాంట్‌లో రోజుకు 20 టన్నుల (TPD) సామర్థ్యం గల 'బయోగ్యాస్ ప్లాంట్' ఏర్పాటు పనులు చివరి దశకు చేరుకున్నాయని, ఇది 2026-27 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందని మారుతి సుజుకి స్పష్టం చేసింది.

⬇ Full News JPG⬇ Short News JPG
← సజ్జనార్ పై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిమీర్‌పేట్ అమ్మాయికి బిగ్ ఛాన్స్: హైదరాబాద్ U-19 క్రికెట్ జట్టుకు అక్కి ఆశ్రిత గౌడ్ ఎంపిక! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com