☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

రూ.1000 కోట్లతో 5,118 పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క

రూ.1000 కోట్లతో 5,118 పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క Caption of Image. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హ్యామ్ రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా సాచ్యురేషన్ మోడ్‌‌లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రస్తుతం 5,118 గ్రామపంచాయతీలకు సొంత భవనాలు లేవని, ఆయా పంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికే 3,269 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ ఏడాదిలో పూర్తిచేసేలా లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా
రూ.1000 కోట్లతో 5,118 పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క
రూ.1000 కోట్లతో 5,118 పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
  • హ్యామ్ రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా సాచ్యురేషన్ మోడ్‌‌లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రస్తుతం 5,118 గ్రామపంచాయతీలకు సొంత భవనాలు లేవని, ఆయా పంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు.

ఇప్పటికే 3,269 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ ఏడాదిలో పూర్తిచేసేలా లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌‌లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. సమీక్షకు స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు.

రూ.800 కోట్లతో 8 వేల గ్రామాల్లో మహిళా భవనాలు

రాష్ట్రంలోని 8,000 గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.800 కోట్ల నిధులను మంజూరు చేసిందని, ఇప్పటికే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని వివరించారు. గ్రామీణ రహదారులను హ్యామ్ విధానంలో నిర్మిస్తున్నామని, దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని గ్రామీణ రహదారుల నిర్మాణానికి వినియోగిస్తున్నామని వెల్లడించారు.

హ్యామ్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 3,861 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తున్నామని, రూ.3,382 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ ప్రాజెక్టు మొదటి విడతలో చేపడుతున్న రహదారుల్లో సుమారు 50 శాతం నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయని, అందువల్ల అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేక శ్రద్ధతో పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← జీసీసీలలోనూ జాబ్ కట్స్... ఏఐ ప్రభావంతో వేలాది మందిపై వేటురంగనాయక సాగర్ లో పంపింగ్ ప్రారంభం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com