☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: మంత్రి వివేక్ వెంకటస్వామి

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: మంత్రి వివేక్ వెంకటస్వామి
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: మంత్రి వివేక్ వెంకటస్వామి
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల: బెల్లంపల్లిలో జరిగిన దసరా వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ అని.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని చెప్పారు. ప్రజా పాలన ప్రభుత్వం ద్వారా మన ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నామని తెలిపారు.

దేశంలోనే తెలంగాణలో రైతులకు 23 వేల కోట్ల రుణమాఫీ చేశామని, సన్న బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ లాంటి పథకాలను ప్రవేశపెట్టామని, ప్రభుత్వం విద్య వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

ALSO READ : సొంతూరిలో సీఎం రేవంత్ దసరా పండుగ..

జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంత నిరుద్యోగులకు మందమర్రిలో జర్మనీ భాషపై ట్రైనింగ్ ఇస్తున్నామని, బెల్లంపల్లి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రావణ వధ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం చాలా సంతోషమని, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← జింబాబ్వేకు చుక్కలు చూపించిన షెఫాలీ, హర్మన్ ప్రీత్ కౌర్.. 92 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీసొంతూరిలో సీఎం రేవంత్ దసరా పండుగ.. శమీ పూజ చేసి కోరిక రాసిన సీఎం ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com