☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

సొంతూరిలో సీఎం రేవంత్ దసరా పండుగ.. శమీ పూజ చేసి కోరిక రాసిన సీఎం !

సొంతూరిలో సీఎం రేవంత్ దసరా పండుగ.. శమీ పూజ చేసి కోరిక రాసిన సీఎం ! Caption of Image. కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లాలోని తన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. వేద పండితుల సమక్షంలో మంత్రోచ్ఛరణల మధ్య జమ్మిచెట్టుకు సీఎం రేవంత్ పూజలు చేశారు. శమీ పూజ చేసి కోరిక రాశారు. శమీ పూజ కోరిక రాసిన సీఎం రేవంత్ #cmrevanthreddy #Kondareddypalli #shamipooja #dasara https://t.co/x0nOJC5VHi — V6 News (@V6News) October 20, 2026 కొండారెడ్డి పల్లి గ్రామస్తులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం.. కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. దసరా వేడుకలలో భాగంగా రావణ దహనం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ వీక
సొంతూరిలో సీఎం రేవంత్ దసరా పండుగ.. శమీ పూజ చేసి కోరిక రాసిన సీఎం !
సొంతూరిలో సీఎం రేవంత్ దసరా పండుగ.. శమీ పూజ చేసి కోరిక రాసిన సీఎం !

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లాలోని తన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. వేద పండితుల సమక్షంలో మంత్రోచ్ఛరణల మధ్య జమ్మిచెట్టుకు సీఎం రేవంత్ పూజలు చేశారు. శమీ పూజ చేసి కోరిక రాశారు.

కొండారెడ్డి పల్లి గ్రామస్తులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం.. కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. దసరా వేడుకలలో భాగంగా రావణ దహనం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ వీక్షించారు. సీఎంతో పాటు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. ఈ పండుగ ధైర్యం, ధర్మం, సత్యం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు.

మనలోని అహంకారం, అసూయలను తొలగించుకుని, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జమ్మిచెట్టును పూజించి, ఆకులను బంగారంగా భావించి పెద్దల ఆశీర్వాదం తీసుకునే మన సంప్రదాయం ప్రకృతిని, పెద్దలను గౌరవించాలని చాటిచెబుతుందని వివరించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: మంత్రి వివేక్ వెంకటస్వామిDonald Trump: భార‌త్‌, అమెరికా మ‌ధ్య త్వ‌ర‌లో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com