☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

Donald Trump: భార‌త్‌, అమెరికా మ‌ధ్య త్వ‌ర‌లో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్‌

Donald Trump: భార‌త్‌, అమెరికా మ‌ధ్య వాణిజ్య ఒప్పందం జ‌ర‌గ‌నున్న‌ద‌ని, ఆ ప్ర‌క్రియ చాలా ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన‌ట్లు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గ‌తంలో కుదుర్చుకున్న ఒప్పందాల క‌న్నా ఇది భిన్నంగా ఉంటుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు తెలిపారు.
Donald Trump: భార‌త్‌, అమెరికా మ‌ధ్య త్వ‌ర‌లో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్‌

న్యూయార్క్‌: కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవ‌డానికి భార‌త్‌, అమెరికా చాలా ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన‌ట్లు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. గ‌తంలో కుదుర్చుకున్న ఒప్పందాల క‌న్నా ఇది భిన్నంగా ఉంటుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు తెలిపారు. ఓవ‌ల్ ఆఫీసులో రిపోర్ట‌ర్ల‌తో ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌తో డీల్ కుదుర్చుకోవాల‌ని భార‌త్‌కు ఉంద‌ని, మేం ఇక ఆ ఒప్పందం కుదుర్చ‌కుంటామ‌ని, ఆ అంశం చాలా దగ్గ‌ర‌ప‌డింద‌న్నారు. ప్ర‌స్తుతం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇండియాలో ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంతో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ద్వైపాక్షిక సంబంధాల బ‌లోపేతంపై రూబియా దృష్టిపెట్టారు. వాణిజ్యం, ఇంధ‌నం, టెక్నాల‌జీ, ర‌క్ష‌ణ రంగాల్లోనూ రెండు దేశాలు స‌హ‌కారం అందించుకోనున్నాయి. ఈ నెల మొద‌ట్లో భార‌త వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌.. అమెరికా ట్రేడ్ ప్ర‌తినిధుల‌ను క‌లిశారు. జేమిస‌న్ గ్రీర్ అనే వ్య‌క్తిని ఆయ‌న అమెరికాలో క‌లిసిన విష‌యం తెలిసిందే. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన ఫ్రేమ్‌వ‌ర్క్ తొలి ద‌శ వివరాల‌పై ఫిబ్ర‌వ‌రిలోనే రెండు దేశాలు మాట్లాడుకున్నాయి. అయితే ప‌న్నుల విధింపులో అమెరికా మార్పులు చేయ‌డంతో మ‌రోసారి వాణిజ్య డీల్‌పై చ‌ర్చ‌లు చేప‌ట్టాల్సి వ‌చ్చింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← సొంతూరిలో సీఎం రేవంత్ దసరా పండుగ.. శమీ పూజ చేసి కోరిక రాసిన సీఎం !Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com