Warangal | వరంగల్ నగరంలోని రంగలీల మైదానంలో నిర్వహించిన రావణ వధ కార్యక్రమం సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ఎంట్రీ పాసులు ఉన్నప్పటికీ ప్రేక్షకులను లోపలికి అనుమతించలేదు. లోపలికి వెళ్లేందుకు జనం ఒక్కసారిగా ప్రయత్నించడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ ఘటనలో పలువురు మహిళలు, చిన్నారులకు గాయాలైనట్లు సమాచారం. కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులకు ఎంట్రీ పాసులు ఉన్నా అనుమతించకపోవడంపై అసహనం వ్యక్తమైంది. పోలీసుల తీరుతో పాటు, భారీగా తరలివచ్చిన ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యారంటూ పలువురు మండిపడ్డారు. రావణ వధ కార్యక్రమం సందర్భంగా ఏర్పడిన ఈ పరిస్థితులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వరంగల్ – రంగలీల మైదానంలోని రావణ వధ కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం
ఎంట్రీ పాసులు ఉన్నా లోపలికి అనుమతించని పోలీసులు
ప్రజలు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా స్వల్ప తొక్కిసలాట
పలువురు మహిళలు, చిన్నారులకు గాయాలు
రావణ వధ కార్యక్రమం ఏర్పాటులో అధికారుల వైఫల్యంపై మండిపడుతున్న ప్రజలు
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2026






