☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

‘అంద‌రూ కొలిచే దేవుడి ప‌ట్ల మంత్రుల నిర్ల‌క్ష్యం’

అంద‌రు కొలిచే దేవుడు గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌నం ప‌ట్ల జిల్లా మంత్రులు, ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు తీవ్రంగా ఖండించారు. బుధ‌వారం వేములపల్లి సాగర్ ఎడమకాల్వ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల‌ను వారు ప‌రిశీలించారు.
‘అంద‌రూ కొలిచే దేవుడి ప‌ట్ల మంత్రుల నిర్ల‌క్ష్యం’

– సాగ‌ర్ ఎడ‌మ కాల్వ అడుగు లోతు నీళ్ల‌లో గ‌ణ‌నాథుల నిమ‌జ్జనం
– ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల తీవ్ర విమ‌ర్శ‌లు

న‌ల్ల‌గొండ‌, సెప్టెంబ‌ర్ 23 : అంద‌రు కొలిచే దేవుడు గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌నం ప‌ట్ల జిల్లా మంత్రులు, ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు తీవ్రంగా ఖండించారు. బుధ‌వారం వేములపల్లి సాగర్ ఎడమకాల్వ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల‌ను వారు ప‌రిశీలించారు. అడుగు లోతు నీళ్లలోనే కొంతమంది వినాయకులను నిమజ్జనం చేయడం చూసి నివ్వెరపోయారు. దేవుడి నిమ‌జ్జ‌నానికి నీళ్లు లేకుండా చేసి తీవ్ర అపచారం చేసిన మంత్రులు, అధికారుల తీరును వారు తీవ్రంగా నిర‌సించారు.

'అంద‌రూ కొలిచే దేవుడి ప‌ట్ల మంత్రుల నిర్ల‌క్ష్యం'

‘అంద‌రూ కొలిచే దేవుడి ప‌ట్ల మంత్రుల నిర్ల‌క్ష్యం’

భక్తుల నమ్మకాలను వమ్ము చేసేలా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. వేములపల్లి వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని, ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్తే నమ్మామ‌న్నారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు సైతం అడుగు లోతు నీళ్లు మాత్ర‌మే రావ‌డం ప్ర‌భుత్వ నిర్లక్ష్యం వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి, మర్లపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, బాపయ్య, రావుల శ్రీనివాస రెడ్డి, రాపోలు వెంకటేశ్వర్లు, అశోక్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

'అంద‌రూ కొలిచే దేవుడి ప‌ట్ల మంత్రుల నిర్ల‌క్ష్యం'

‘అంద‌రూ కొలిచే దేవుడి ప‌ట్ల మంత్రుల నిర్ల‌క్ష్యం’

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Jammu and Kashmir | జ‌మ్మూ కాశ్మీర్‌పై మాట్లాడే హ‌క్కు మీకు లేదు.. ఓఐసీ దేశాల‌కు ఇండియా వార్నింగ్NRI BRS UK | దాస్యం వినయ్ భాస్కర్‌పై దాడి ఆందోళన కలిగించే విషయం : ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే కార్యదర్శి మాదిరెడ్డి నవీన్ రెడ్డి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com