☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Jammu and Kashmir | జ‌మ్మూ కాశ్మీర్‌పై మాట్లాడే హ‌క్కు మీకు లేదు.. ఓఐసీ దేశాల‌కు ఇండియా వార్నింగ్

Jammu and Kashmir : జ‌మ్మూ కాశ్మీర్ అంశంపై మాట్లాడే హ‌క్కు ఓఐసీ దేశాల‌కు లేద‌ని ఇండియా తెలిపింది. ఈ అంశంపై స్పందించిన ఐఓసీ తీరును ఇండియా త‌ప్పుబ‌ట్టింది. ఈ మేర‌కు బుధ‌వారం కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ ఒక ప్ర‌క‌ట‌న చేసింది.
Jammu and Kashmir | జ‌మ్మూ కాశ్మీర్‌పై మాట్లాడే హ‌క్కు మీకు లేదు.. ఓఐసీ దేశాల‌కు ఇండియా వార్నింగ్

Jammu and Kashmir : జ‌మ్మూ కాశ్మీర్ అంశంపై మాట్లాడే హ‌క్కు ఓఐసీ దేశాల‌కు లేద‌ని ఇండియా తెలిపింది. ఈ అంశంపై స్పందించిన ఐఓసీ తీరును ఇండియా త‌ప్పుబ‌ట్టింది. ఈ మేర‌కు బుధ‌వారం కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ ఒక ప్ర‌క‌ట‌న చేసింది. కుదిరితే తీవ్ర‌వాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాల‌ని సూచించింది. ప్ర‌స్తుతం ఐక్య‌రాజ్య‌స‌మితి సర్వ‌స‌భ్య స‌మావేశం అమెరికాలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశాల్లో ఓఐసీ త‌ర‌ఫున ట‌ర్కీ అధ్య‌క్షుడు ఎర్డోగాన్ మాట్లాడాడు.

ద‌క్షిణాసియాలోని అనేక స‌మ‌స్య‌ల్ని, వివాదాల్ని చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు. ఈ సంద‌ర్బంగా జ‌మ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్ర‌స్తావించారు. అయితే, సంబంధం లేకుండా జ‌మ్మూ కాశ్మీర్ అంశం గురించి మాట్లాడ‌టాన్ని ఇండియా త‌ప్పుబ‌ట్టింది. జ‌మ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడే హ‌క్కు ఓఐసీ కాంటాక్ట్ గ్రూప్‌న‌కు లేద‌న్నారు. అంతేకాదు.. జ‌మ్మూ కాశ్మీర్, ల‌దాక్ ఎప్ప‌టికీ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మ‌ని, వీటి విష‌యంలో ఎలాంటి రాజ‌కీయ జోక్యాన్ని స‌హించ‌బోమ‌ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ ప్ర‌క‌టించింది.

పాకిస్తాన్ చేస్తున్న ఈ ఉద్దేశ‌పూర్వ‌క‌, త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మే బ‌దులు.. ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ది చెప్పాల‌ని కేంద్రం సూచించింది. ఉగ్ర‌వాదాన్ని పాకిస్తాన్ ప్రోత్స‌హిస్తుంది అనేందుకు ఆధారాలున్నాయ‌న్నారు. అన‌వ‌స‌ర విష‌యాల‌పై ఓఐసీ స్పందించి ఆ గ్రూపున‌కు ఉన్న విశ్వ‌స‌నీయ‌త‌ను పోగొట్టుకోవ‌ద్ద‌ని హిత‌వు ప‌లికింది. ఓఐసీ అంటే.. ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ ఇస్లామిక్ కోప‌రేష‌న్. ఇందులో పాకిస్తాన్‌తోపాటు ట‌ర్కీ, సౌదీ అరేబియా, అజార్ బైజాన్, నైగ‌ర్ దేశాలు స‌భ్యులుగా ఉన్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← గణేష్ ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సందడి‘అంద‌రూ కొలిచే దేవుడి ప‌ట్ల మంత్రుల నిర్ల‌క్ష్యం’ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com