☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు: మంత్రి తుమ్మల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు: మంత్రి తుమ్మల Caption of Image. భద్రాద్రి రాముల వారి ఆశీస్సులతో సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గోదావరి జలాలు పారించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద... మారెళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఎల్ నినో లాంటి రాకాసి ప్రకృతి పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో నిధులు మంజూరు చేశారని కొనియాడారు. ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ నీళ్లు అందిస్తామని, జూలూరుపాడు టన్నెల్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు: మంత్రి తుమ్మల
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు: మంత్రి తుమ్మల

భద్రాద్రి రాముల వారి ఆశీస్సులతో సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గోదావరి జలాలు పారించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద... మారెళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఎల్ నినో లాంటి రాకాసి ప్రకృతి పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో నిధులు మంజూరు చేశారని కొనియాడారు. ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ నీళ్లు అందిస్తామని, జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేసి పాలేరుకు... యాతాలకుంట టన్నెల్ పూర్తి చేసి సత్తుపల్లికి గోదావరి జలాలు అందించి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిన తరుణంలో... సీతారామ ప్రాజెక్టే సాగు చేసిన పంటలకు కొండంత భరోసాగా నిలిచిందని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, నీటిని, కరెంటును పొదుపుగా వాడి రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి సూచించారు. తుమ్మల చెరువుకు గోదావరి జలాలు కావాలని దశాబ్దాలుగా రైతులు ఎదురుచూస్తున్న కల నేడు మారెళ్లపాడు ఎత్తిపోతల ద్వారా నెరవేరిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు లేని స్థిరమైన వ్యవసాయం కోసం రైతులు పామాయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వం భద్రాచలం రామాలయ అభివృద్ధిలో మాట తప్పిందని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో భద్రాచలం రామాలయాన్ని ముందు తరాలకు తెలిసేలా అద్భుతంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← రైల్వే టికెట్లపై యూపీఐ ఛార్జీలు.. రూ.2 వేల పైన టికెట్ ధర ఉంటే అదనంగా రూ.5 చెల్లించాలా..?ఎటర్నల్ చొరవ: జొమాటో, బ్లింకిట్ డెలివరీ పార్ట్‌నర్ల టాక్స్ ఫైలింగ్.. రూ.33 కోట్లు రీఫండ్స్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com