☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం.. 28 ఏళ్ల భారత పతక నిరీక్షణకు తెర

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం.. 28 ఏళ్ల భారత పతక నిరీక్షణకు తెర
ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం.. 28 ఏళ్ల భారత పతక నిరీక్షణకు తెర
ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం.. 28 ఏళ్ల భారత పతక నిరీక్షణకు తెర

టోక్యో: భారత స్టార్ వెయిట్‎లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్ర సృష్టించారు. జపాన్ వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆమె రజత పతకం సాధించారు. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడ్డ ఆమె స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలతో కలిపి మొత్తం 198 కేజీల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచారు.

తద్వారా ఆసియా క్రీడల్లో పతకం సాధించాలనే తన చిరకాల వాంఛను నేరవేర్చుకున్నారు. మీరాబాయి చానుకు కూడా ఆసియా క్రీడల్లో ఇదే తొలి మెడల్. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటికే పతకాలు సాధించిన మీరాబాయి చానుకు ఇప్పటివరకు ఆసియా క్రీడల పతకం ఒక్కటే లోటుగా ఉండేది.

తాజా రజతంతో ఆమె తన పతకాల కలెక్షన్‌ను సంపూర్ణం చేసుకున్నారు. దీంతో పాటు వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో 28 ఏళ్ల భారత పతక నిరీక్షణకు మీరాబాయి చాను తెరదించారు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో భారత దిగ్గజ వెయిట్‎లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించారు. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియాకు పతకం రాలేదు. తాజా విజయంతో 28 ఏళ్ల భారత పతక నిరీక్షణకు చాను తెరదించారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. సెప్టెంబర్ 25, 28 లాస్ట్ డేట్స్.. ఇంటర్వ్యూ ద్వారా జాబ్ !యూత్ కు గుడ్ న్యూస్.. ITBPలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. జీతం, అర్హతలు వివరాలు ఇవే ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com