☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ప్రభుత్వ పథకాల అమలులో ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వరా..!: ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు

ప్రభుత్వ పథకాల అమలులో ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వరా..!: ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు
ప్రభుత్వ పథకాల అమలులో ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వరా..!: ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు
ప్రభుత్వ పథకాల అమలులో ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వరా..!: ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు
  • మెదక్ దిశ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో అధికారులపై ఎంపీ ఆగ్రహం

మెదక్, వెలుగు: ‘ప్రజాప్రతినిధులకు చెప్పకుండానే పథకాలు అమలు చేస్తారా.. అంతా మీ ఇష్టారాజ్యమేనా.. అలా అయితే ఇక మేమెందుకు..’ అని మెదక్ ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్​ జిల్లా దిశ కమిటీ మీటింగ్​శుక్రవారం కలెక్టరేట్లో జరిగింది. శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ఎంపీ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫామ్​మెకనైజేషన్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే ఎంపీకి సమాచారం ఇవ్వకుండా, పిలవకుండా మంత్రి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా రైతులకు పరికరాలు పంపిణీ చేయడం ఏంటని డీఏవో దేవకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మండిపడ్డారు.

సబ్సిడీ ట్రాక్టర్లు జిల్లాకు మంజూరైన విషయం కూడా ఎందుకు చెప్పలేదని హార్టికల్చర్​ ఆఫీసర్​ప్రతాప్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించారు. జిల్లాలో154 మంది విద్యార్థులకు నెలకు రూ.4 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు డీడబ్ల్యూవో హేమ భార్గవి తెలపగా సర్పంచులకు కనీస సమాచారం ఇవ్వరా, అంత సీక్రెట్ ఎందుకని ప్రశ్నించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వివరాలు అందజేయాలని డీపీవో యాదయ్యను ఆదేశించారు. మెదక్​, నర్సాపూర్​, చేగుంట, కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబుల్​ బెడ్​రూమ్​ఇండ్లు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని హౌసింగ్​ డీఎంను అడిగారు.

అక్రమ నిర్మాణాలకు కరెంట్​కనెక్షన్లు తొలగించాలని ట్రాన్స్​కో ఎస్ఈ నారాయణ నాయక్‌‌‌‌‌‌‌‌ను ఎంపీ ఆదేశించారు. జిల్లాలో పొల్యూషన్​ లేని ప్రాంతంలో సెమీ కండక్టర్ యూనిట్​ ఏర్పాటు కోసం వంద ఎకరాల స్థలం ఎంపిక చేయాలని ఎంపీ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు అర్హులైన ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్​ప్రతిమాసింగ్, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో అంబదాస్​రాజేశ్వర్​ పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యంపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్‌‌‌‌‌‌‌‌కు లేదు

మెదక్​, వెలుగు: ప్రజాస్వామ్యంపై మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీకి లేదని ఎంపీ రఘునందన్ రావ్ విమర్శించారు. రాజ్యంగ వ్యవస్థల్ని కుప్పకూల్చిన వారే ఇపుడు ఎర్ర పుస్తకం చేతిలో పట్టుకుని రోడ్డుమీదకు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం మెదక్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, రాజ్యంగ వ్యవస్థలపై ఆయనకు విశ్వాసం లేదని విమర్శించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలను ఆర్టికల్​ 356 ద్వారా గద్దె దించిన కాంగ్రెస్​ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ గుప్పిట్లో పెట్టుకుందని రాహుల్​ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్ గౌడ్​ ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్​, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వీణ తదితరులు ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← చెత్తను వేరు చేయడంపై GHMC అవగాహనశత్రు, మిత్రదేశాలపై యూఎన్ వేదికగా నెతన్యాహు ఫైర్.. న్యూయార్క్ మేయర్‌‌‌‌‌‌‌‌, విమర్శకులపై ఆగ్రహం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com