☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

Multiple Credit Cards : మల్టిపుల్ క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? ఈ తప్పు అస్సలు చేయకండి!

Multiple Credit Cards : ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయా? 30శాతం క్రెడిట్ యుటిలైజేషన్ రూల్ ఎలా వర్తిస్తుంది? అధిక వినియోగం క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Multiple Credit Cards : మల్టిపుల్ క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? ఈ తప్పు అస్సలు చేయకండి!
  • ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా?
  • 30శాతం రూల్ అన్ని కార్డులకు వర్తిస్తుందా?
  • క్రెడిట్ కార్డుపై 30శాతం రూల్..
  • స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి?

Multiple Credit Cards : క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే, మీ క్రెడిట్ లిమిట్‌లో 30 శాతం కన్నా తక్కువే ఖర్చు చేయాలనే మాట వినే ఉంటారు. మరి మీ దగ్గర రెండు, 3 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే ఏం చేయాలి? ప్రతి కార్డుపైనా 30 శాతం పరిమితిని పాటించాలా? లేక అన్ని కార్డుల వినియోగాన్ని కలిపి లెక్కించాలా? ఈ విషయం తెలుసుకోవడం తప్పనిసరి. తద్వారా మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గకుండా జాగ్రత్త పడొచ్చు.

క్రెడిట్ వినియోగం ఏంటి? :
మీకు అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్‌లో ఎంత మొత్తాన్ని వాడుతున్నారో తెలిపేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (Credit Utilization Ratio). సాధారణంగా, ఈ నిష్పత్తి తక్కువగా ఉంటే మీ క్రెడిట్ ప్రొఫైల్‌కు మంచిదిగా చెబుతారు. 30 శాతాన్ని ఒక సాధారణ మార్గదర్శకంగా చూస్తారు. అయితే, కచ్చితమైన పరిమితి కాదు.

మల్టీ కార్డులుంటే ఎలా లెక్కించాలి? :
మీ దగ్గర ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే.. అన్ని కార్డుల క్రెడిట్ లిమిట్లను కలపాలి. అలాగే, వాటిపై ఉన్న మొత్తం బకాయిలను కూడా కలిపి లెక్కించాలి. మొత్తం బకాయిని మొత్తం క్రెడిట్ లిమిట్‌తో భాగిస్తే మీ మొత్తం క్రెడిట్ వినియోగ రేషియో తెలుస్తుంది.

Read Also : Best Bank FD Rates : ఏ బ్యాంకులో FD చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది? అక్టోబర్‌లో టాప్ బ్యాంకులివే!

ఉదాహరణకు.. మీ రెండు కార్డుల మొత్తం పరిమితి రూ.2 లక్షలు అనుకుందాం.. వాటిపై మొత్తం బకాయి రూ.40వేలు ఉంటే, మీ క్రెడిట్ వినియోగం 20 శాతం అవుతుంది. అంటే, మొత్తం వినియోగం 30 శాతం కన్నా తక్కువగా ఉంది.

అయితే, మొత్తం వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ, ఒక్క కార్డుపై లిమిట్ దగ్గరగా ఖర్చు చేయడం కూడా మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రభావం పడొచ్చు. అందుకే ప్రతి కార్డు వినియోగాన్ని విడిగా మానిటరింగ్ చేయడం బెటర్.

30 శాతం దాటితే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా? :
ఒక్కసారి 30 శాతం దాటినంత మాత్రాన క్రెడిట్ స్కోర్ వెంటనే పడిపోతుందని కాదు. కానీ, తరచూ హై క్రెడిట్ వినియోగం ఉండటం స్కోర్‌పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపవచ్చు. అందుకే బకాయిలను అదుపులో ఉంచడం, గడువులోగా పేమెంట్లు చేయడం, కార్డు లిమిట్ పూర్తిగా వాడకుండా ఉండటం చాలా ముఖ్యం.

మీ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నా, మొత్తం వినియోగంతో పాటు ప్రతి కార్డు వినియోగంపైనా ఫోకస్ పెట్టండి. 30 శాతాన్ని కఠినమైన రూల్ కాకుండా, ఆర్థిక క్రమశిక్షణకు ఉపయోగపడే మార్గదర్శకంగానే చూడండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Personal Loan : శాలరీ స్లిప్ లేకున్నా పర్సనల్ లోన్ వస్తుందా? అప్లయ్ చేసే ముందు జాగ్రత్త.. బ్యాంకులు చూసేది ఇవే..!సచిన్ టెండూల్కర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నా.. బవుమా అద్భుత ఇన్నింగ్స్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com