☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!

Nani: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరికీ మొదట గుర్తొచ్చేది ఆయన క్రమశిక్షణ, బయట కనిపించే గంభీరమైన వ్యక్తిత్వం మాత్రమే. అయితే, ఆయన లోపల ఉన్న అసలైన మనుషుని గురించి, ఆయన పంచే ప్రేమ గురించి ఎవరికీ తెలియని విశేషాలను బయటపెట్టారు నేచురల్ స్టార్ నాని. ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన తర్వాత ఆయనతో ఏర్పడిన అనుబంధంపై నాని చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి […]
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!

Nani: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరికీ మొదట గుర్తొచ్చేది ఆయన క్రమశిక్షణ, బయట కనిపించే గంభీరమైన వ్యక్తిత్వం మాత్రమే. అయితే, ఆయన లోపల ఉన్న అసలైన మనుషుని గురించి, ఆయన పంచే ప్రేమ గురించి ఎవరికీ తెలియని విశేషాలను బయటపెట్టారు నేచురల్ స్టార్ నాని. ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన తర్వాత ఆయనతో ఏర్పడిన అనుబంధంపై నాని చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచే తాను మోహన్ బాబు చిత్రాలకు వీరాభిమానినని గుర్తు చేసుకున్న నాని, ఎడిటింగ్ రూమ్‌లో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. “సినిమా రఫ్ ఎడిట్ చూపిస్తున్న సమయంలో మోహన్ బాబు గారి క్యారెక్టర్‌కు వేరే ఎవరో ట్రాక్ డబ్బింగ్ చెప్పారు. ఆ సన్నివేశాలు రాగానే నాకు స్క్రీన్ వైపు అస్సలు చూడబుద్ధి కాలేదు. ఆయన ముఖంపై వేరే వాళ్ల వాయిస్‌ను ఊహించడం కూడా అసాధ్యం. మోహన్ బాబు గారి ఒరిజినల్ గొంతుతో చెవులు తూట్లు పడేలా ఒక డైలాగ్ వినిపిస్తేనే ఆ హై వస్తుంది, ఆ కిక్ వస్తుంది. బయట సమాజంలో మోహన్ బాబు గారు చాలా స్ట్రిక్ట్ అనే ఒక ఇమేజ్ ఉంది. మొదట్లో నేను కూడా అదే నమ్మాను. కానీ ఆయనతో కలిసి ప్రయాణించిన తర్వాత నా ఫేవరెట్ వ్యక్తుల్లో ఒకరిగా మారిపోయారు. ఆయన ఒక అద్భుతమైన మనిషి” అని నాని కొనియాడారు. మోహన్ బాబు బయటకు కనిపించే తీరు వెనుక ఉన్న రహస్యాన్ని నాని సరదాగా విశ్లేషించారు. “ఆయన లోపల ఉన్న మంచి వర్షన్ బయటకు రాకుండా ఎందుకో మోహన్ బాబు గారే జాగ్రత్త పడుతున్నారు అనిపిస్తుంది. తన అసలైన స్వభావం బయటపడితే ఎక్కడ అందరూ తనతో ప్రేమలో పడిపోతారోనని భయంతో.. అందరిలో ఆ భయం అలానే ఉండాలని తన మంచితనాన్ని తనలోనే దాచుకుంటున్నారు” అంటూ నాని చమత్కరించారు.

‘ది పారడైజ్’ చిత్రంతో మొదలైన తమ బంధం వ్యక్తిగత స్థాయికి చేరిందని నాని వివరించారు. “సినిమా రిలీజ్ ముందు రోజు కూడా నాకు ఫోన్ చేశారు. నిన్న కూడా మా ఇంటికి పండ్లు, రకరకాల గూడీస్ పంపించారు. ఒక్కసారి ఆయన ఎదుటి వ్యక్తిని తనవాడిగా ఓన్ చేసుకున్నారంటే.. ఆయన చూపించే ప్రేమని ఎవరూ తట్టుకోలేరు, భరించలేరు. ఆయన గారాబం చేసే విధానం అంత ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని చిత్రాలకు దర్శకత్వ పర్యవేక్షణ ఉన్నట్లే.. ‘ది పారడైజ్’కు నేను హీరోనే కావచ్చు, కానీ నా పైన ఉన్న అసలైన హీరో మాత్రం మోహన్ బాబు గారే” అని నాని స్పష్టం చేశారు. ఈ సినిమాతో ప్రారంభమైన తమ రిలేషన్‌షిప్‌ను జీవితాంతం ఇలాగే కొనసాగిస్తానని, మోహన్ బాబుతో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని నాని పేర్కొన్నారు. మోహన్ బాబు వ్యక్తిత్వంపై నాని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సినీ అభిమానుల హృదయాలను హత్తుకుంటున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com