☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?

The Paradise: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో ప్రీమియర్స్‌తోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం, రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా చిత్రం వస్తుందటంతో ‘ది ప్యారడైజ్’పై జనాల్లో హైప్ ఆకాశాన్ని తాకింది. రెగ్యులర్ రిలీజ్ కంటే ముందే సెప్టెంబర్ 23 రాత్రి దేశవ్యాప్తంగా ప్రదర్శించిన ది ప్యారడైజ్ స్పెషల్ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ […]
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?

The Paradise: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో ప్రీమియర్స్‌తోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం, రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా చిత్రం వస్తుందటంతో ‘ది ప్యారడైజ్’పై జనాల్లో హైప్ ఆకాశాన్ని తాకింది. రెగ్యులర్ రిలీజ్ కంటే ముందే సెప్టెంబర్ 23 రాత్రి దేశవ్యాప్తంగా ప్రదర్శించిన ది ప్యారడైజ్ స్పెషల్ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా కేవలం ప్రీమియర్స్‌తోనే ఏకంగా రూ. 12.8 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. నాని కెరీర్‌లోనే ఇది ఆల్-టైమ్ రికార్డ్ ఓపెనింగ్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు కనీవినీ ఎరుగని స్థాయిలో థియేటర్లలో రికార్డు ఆక్యుపెన్సీ నమోదైంది.

శ్రీకాంత్ ఓదెల విజువల్ మేకింగ్, నాని నెవర్ బిఫోర్ మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ఉన్న భారీ అంచనాలకు ప్రీమియం టికెట్ రేట్లు కూడా తోడవడంతో వసూళ్ల జాతర సాగింది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లోని ప్రీమియర్ షోలన్నీ గంటల వ్యవధిలోనే హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశాయి. ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్‌గా కయాదు లోహర్ తన అందం, అభినయంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా మారగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు తమ పాత్రల్లో అద్భుతంగా మెప్పించారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక్క రాత్రి ప్రీమియర్స్‌తోనే దాదాపు రూ.13 కోట్లకు చేరువగా గ్రాస్ రాబట్టి ప్రభంజనం సృష్టించిన ‘ది ప్యారడైజ్’, ఫస్ట్ డే ముగిసేసరికి ఇంకెన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.

⬇ Full News JPG⬇ Short News JPG
← Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com