☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!

ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొందరు వర్షాలను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు.
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!

ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొందరు వర్షాలను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు. బంగాళాఖాతంలో ‘సైక్లోన్ అర్నబ్’ ఏర్పడిందని.. తీరాన్ని తాకబోతుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. నిజంగానే తూర్పు తీరాన్ని విధ్వంసకర తుఫాన్ తాకబోతుందా? లేదంటే అది కేవలం పుకారేనా? సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చేసింది.

ప్రస్తుతం వాతావరణ శాఖ (IMD) అధికారిక రికార్డుల్లో ఎక్కడా కూడా ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో తుఫాన్ లేదు. బంగాళాఖాతంలో అలాంటి తుఫానే ఏర్పడ లేదు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ‘తీవ్ర అల్పపీడనం’ కొనసాగుతోంది. దీంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి. ఇది తుఫాన్‌గా మార్పు చెందలేదు. తుఫానుగా ప్రకటించడానికి కఠినమైన శాస్త్రీయ ప్రమాణాలుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులకు అలాంటి ప్రమాణాలు ఏమీ కనిపించలేదు. దీంతో ఐఎండీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే వాతావరణ శాఖ నిర్ధారించకుండానే సోషల్ మీడియాలో మాత్రం తుఫాన్ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

‘అర్నబ్’ అనే పేరు ఎలా వచ్చింది?

వాస్తవానికి బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుఫానులకు పేర్లు పెట్టే 13 దేశాల ప్యానెల్ ఒకటి ఉంది. ఆ జాబితాలో తర్వాత పేరు బంగ్లాదేశ్ ప్రతిపాదించిన ‘అర్నబ్’ పేరు ఉంది. బెంగాలీలో దీనికి ‘సముద్రం’ అని అర్థం. నిజంగా తుఫానుగా బలపడినప్పుడు ఈ పేరు అమల్లోకి వస్తుంది. కానీ అదేమీ లేకుండానే ‘అర్నబ్’ తుఫాన్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తుఫాన్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాన్ని తేలిగ్గా తీసుకోవడానికి కూడా ఉండదు. తీవ్ర అల్పపీడనం భారీ తేమను తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్‌లో.. దక్షిణ ఒడిశాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. వరదలు ఏర్పడుతున్నాయి. ముందు జాగ్రత్తగా అధికారులు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తుఫాన్ వార్తలు కాకుండా.. అధికారికంగా వాతావరణ శాఖ తెలియజేసే వార్తలను విశ్వసిస్తే భయపడక్కర్లేదు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com