☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!! • మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? • ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు • ఓడియమ్మ: బాత్రూమ్‌ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. • Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..? • చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! • ఈ నెలాఖరుకు గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్టే! • కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం! •

LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..

అక్టోబర్ 1 నుంచి గృహ వినియోగదారుల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కొరకు బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారుల గ్యాస్ డెలివరీని నిలిపివేయరు. వారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డిజిటల్ ఛానెల్స్ ద్వారా దీనికి నమోదు చేసుకోవచ్చు. సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరపై 5 లేదా 10 కేజీల సిలిండర్లు పొందవచ్చు. డెలివరీ సమయంలో సిబ్బంది ద్వారా లేదా డిస్ట్రిబ్యూటర్ దుకాణానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. […]
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..

అక్టోబర్ 1 నుంచి గృహ వినియోగదారుల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కొరకు బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారుల గ్యాస్ డెలివరీని నిలిపివేయరు. వారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డిజిటల్ ఛానెల్స్ ద్వారా దీనికి నమోదు చేసుకోవచ్చు. సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరపై 5 లేదా 10 కేజీల సిలిండర్లు పొందవచ్చు. డెలివరీ సమయంలో సిబ్బంది ద్వారా లేదా డిస్ట్రిబ్యూటర్ దుకాణానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. వినియోగదారులు తమ మొబైల్ యాప్స్ ద్వారా కూడా ఈ-కేవైసీ పూర్తి చేసే సదువు కల్పించారు.

ఇండేన్ కోసం ఇండేన్ ఆయిల్ వన్, భారత్ గ్యాస్ కోసం హలో బీపీసీఎల్, హెచ్‌పీ గ్యాస్ కోసం హెచ్‌పీ పే యాప్ ఉపయోగించాలి. ఈ ఆథెంటికేషన్ ప్రధాన ఉద్దేశం సబ్సిడీ సిలిండర్లు అర్హులైన కుటుంబాలకే అందేలా చూడటం. దీనివల్ల డూప్లికేట్, అనర్హమైన కనెక్షన్‌లను తొలగించవచ్చు. అంతేకాకుండా సబ్సిడీ సిలిండర్లను కమర్షియల్, పారిశ్రామిక అవసరాలకు మళ్లించకుండా అడ్డుకోవడంతో పాటు సబ్సిడీ పంపిణీలో పారదర్శకత పెరుగుతుంది.

ఈ బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయడానికి ప్రభుత్వం మొదట జూన్ 30 గడువు విధించింది. వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ గడువును జూలై 31, ఆగస్టు 7, 15, 23, 31, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 14 వరకు పలుమార్లు పొడిగించారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 12 కోట్లకు పైగా ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలను పంపాయి. గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి డెలివరీ సిబ్బంది ద్వారా నేరుగా సంప్రదించారు.

సెప్టెంబర్ 2026 నాటికి ప్రతి 14.2 కేజీల సిలిండర్‌పై సబ్సిడీ దాదాపు రూ. 210గా ఉంది. వినియోగదారులు సకాలంలో ఈ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయడం ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా సిలిండర్లను పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఈ నూతన నిబంధనల వల్ల గ్యాస్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com