☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదేలా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రత్యేకించి ట్రైలర్‌తో సంబంధం లేకుండానే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ సంచలనం రేపుతున్నాయి. […]
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదేలా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రత్యేకించి ట్రైలర్‌తో సంబంధం లేకుండానే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.

ముఖ్యంగా నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 40 కోట్ల మార్కును దాటేశాయి. నాన్-థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు రూ. 65 కోట్ల భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ నాని కెరీర్‌లోనే అత్యధికంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 75 కోట్లకు పైగా అమ్ముడవగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ. 100 కోట్ల మేర జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల నెట్ లేదా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే డే 1 రూ. 50 కోట్లు గ్రాస్ మార్క్ టచ్ అయ్యే సుచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే నాని కెరీర్ ఇదే హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. మరి ప్యారడైజ్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీIP66+IP68+IP69 రేటింగ్స్‌, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com