☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం

ఐక్యరాజ్యసమితి వేదికగా న్యూయార్క్ మేయర్ మమ్దానీపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం మొదలు పెట్టిన 30 నిమిషాల తర్వాత మమ్దానీ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ‘‘ఇజ్రాయెల్ దేశంపై హమాస్ దాడి చేసినప్పుడు నీ భార్య రమా దువాజీ సమర్థించలేదా?’’ అంటూ మండిపడ్డారు.
Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం

ఐక్యరాజ్యసమితి వేదికగా న్యూయార్క్ మేయర్ మమ్దానీపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం మొదలు పెట్టిన 30 నిమిషాల తర్వాత మమ్దానీ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ‘‘ఇజ్రాయెల్ దేశంపై హమాస్ దాడి చేసినప్పుడు నీ భార్య రమా దువాజీ సమర్థించలేదా?’’ అంటూ మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియా క్లిప్‌లను ఎత్తిచూపించారు. ‘‘బాధితుడిని.. దురాక్రమణదారుడిని తారుమారు చేసినందుకు మీకు సిగ్గుగా ఉండాలి.’’ అని మండిపడ్డారు.

‘‘మీరు ఇజ్రాయెల్‌పై జాతి హత్య ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎప్పుడూ జాతి హత్యకు పాల్పడలేదు. జాతి హత్యను నివారించింది. ఒకవేళ మేము ఆపకపోయింటే మమ్దానీ మిత్రులైన హమాస్ అదే చేసి ఉండేవారు.’’ అని వ్యాఖ్యానించారు.

గత నెల రోజులుగా మమ్దానీ సోషల్ మీడియాలో నెతన్యాహుపై విమర్శలు చేస్తున్నారు. మంగళవారం కూడా ‘భయంకరమైన జాతి నిర్మూలనకు సూత్రధారి’’ అని అభివర్ణించారు. నెతన్యాహు వస్తే అరెస్ట్ చేస్తామంటూ కూడా బెదిరించారు. దమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ నెతన్యాహు కూడా ప్రతి సవాల్ విసిరారు.

ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంతు రాగానే సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. నెతన్యాహు ప్రసంగం ప్రారంభించగానే డజన్ల కొద్దీ ప్రతినిధులంతా జనరల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇక ఇరాన్ వాకౌట్ చేస్తూ ఖాళీ బల్లపై సులేమానీ చిత్రపటాన్ని ఉంచేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సభ నుంచి వెళ్లిపోయిన వారిని ఉద్దేశించి ‘నైతిక పిరికివాళ్లు’ అంటూ నెతన్యాహు సంబోధించారు.

అయితే నెతన్యాహు మద్దతుదారులు మాత్రం సభలో నిలబడి చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. దీంతో మిగిలిన నిరసనకారులంతా వెళ్లిపోవాలని నెతన్యాహు సూచించారు. ఈ సభలో విడిచి వెళ్లని నైతిక పిరికివాళ్లు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. ఇక నెతన్యాహు పనిలో పనిగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, పలువురు అంతర్జాతీయ విమర్శకులపై కూడా మండిపడ్డారు. ఇక అక్టోబర్ 27న ఇజ్రాయెల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యూఎన్‌లో నెతన్యాహు చేసిన ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com