☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!

India Intra Squad Practice Match: వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఇండియా-ఎ, ఇండియా-బి జట్లుగా తలపడిన ఈ మ్యాచ్‌లో పలువురు స్టార్ బ్యాటర్లు సత్తా చాటారు. ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ అజేయ భారీ అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి రాణించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ […]
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!

India Intra Squad Practice Match: వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఇండియా-ఎ, ఇండియా-బి జట్లుగా తలపడిన ఈ మ్యాచ్‌లో పలువురు స్టార్ బ్యాటర్లు సత్తా చాటారు. ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ అజేయ భారీ అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి రాణించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 88 బంతుల్లో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా వేగంగా పరుగులు చేశాడు. జడ్డు 39 బంతుల్లో 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 38 బంతుల్లో 42 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అయితే శుభ్‌మన్ గిల్ మాత్రం 8 బంతుల్లో 7 పరుగులకే పెవిలియన్ చేరాడు.

అనంతరం 320 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-బి 50 ఓవర్లలో 7 వికెట్లకు 309 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 68 బంతుల్లో 72 పరుగులతో ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ 59 బంతుల్లో 64 పరుగులు చేశాడు. వీరిద్దరూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. మిడిలార్డర్‌లో నితీష్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 57 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. న‌మ‌న్ ధీర్ 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ మాత్రం 5 బంతుల్లో 4 పరుగులకే పరిమితమయ్యాడు. చివరికి ఇండియా-బి 309 పరుగులకే పరిమితమైంది.

వెస్టిండీస్‌తో భారత జట్టు మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది. అక్టోబర్ 17 వరకు వెస్టిండీస్‌తో టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనలు తుది జట్టు ఎంపికకు ముందు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్‌ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com