☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్‌ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!

Pakistan-Afghanistan War: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బలూచిస్తాన్‌లోని గులిస్తాన్ సెక్టార్‌లో పాకిస్తాన్ భద్రతా బలగాలు, ఆఫ్ఘాన్ తాలిబాన్ల మద్య కాల్పులు జరిగినట్లు పాక్ మీడియ తెలిపింది. తాలిబాన్లు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నాలను తిప్పికొట్టామని పాక్ భద్రతా బలగాలు చెప్పాయి. తాము చేసిన దాడుల్లో పలువురు తాలిబాన్లు మరణించినట్లు పాకిస్తాన్ చెప్పింది. అయితే, దీనిపై తాలిబాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. మరోవైపు, కాందహార్ స్పిన్ బోల్డక్ ప్రాంతంలో కూడా […]
Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్‌ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!

Pakistan-Afghanistan War: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బలూచిస్తాన్‌లోని గులిస్తాన్ సెక్టార్‌లో పాకిస్తాన్ భద్రతా బలగాలు, ఆఫ్ఘాన్ తాలిబాన్ల మద్య కాల్పులు జరిగినట్లు పాక్ మీడియ తెలిపింది. తాలిబాన్లు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నాలను తిప్పికొట్టామని పాక్ భద్రతా బలగాలు చెప్పాయి. తాము చేసిన దాడుల్లో పలువురు తాలిబాన్లు మరణించినట్లు పాకిస్తాన్ చెప్పింది. అయితే, దీనిపై తాలిబాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.

మరోవైపు, కాందహార్ స్పిన్ బోల్డక్ ప్రాంతంలో కూడా పాకిస్తాన్, ఆఫ్ఘాన్ బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కొన్ని పాకిస్తానీ సరిహద్దు పోస్టులను పాక్ సైనికులు విడిచిపెట్టి పారిపోయారని ఆఫ్ఘాన్ మీడియా చెప్పింది. పాక్-ఆఫ్ఘాన్ మధ్య డ్యూరాండ్ లైన్ వెంట గతంలో పలుమార్లు కాల్పులు చోటుచేసుకున్నాయి.

పాకిస్తాన్ సెప్టెంబర్ 24న ఆఫ్ఘనిస్తాన్‌లోని 10 ప్రాంతాలపై దాడులు చేసింది. తమ దేశంపై డ్రోన్ దాడులు జరిగేందుకు ఈ ప్రాంతంలో డ్రోన్లను నిల్వచేస్తున్నారని అందుకే దాడి చేయాల్సి వచ్చిందిన పాకిస్తాన్ చెప్పింది. అయితే, ఈ వ్యాఖ్యల్ని ఆఫ్ఘనిస్తాన్ తోసిపుచ్చింది. పాక్ చేసిన దాడుల్లో నలుగురు మరణించినట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 23న ఆఫ్ఘాన్ నుంచి వచ్చినట్లు భావిస్తు్న్న 8 డ్రోన్లను తమ భద్రతా బలగాలు కూల్చేశాయని పాకిస్తాన్ చెప్పింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com