☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Netflix గ్లోబల్ ట్రెండింగ్‌లో సౌత్ సినిమాల హవా.. టాప్–10లో మూడు తెలుగు చిత్రాలు!

Netflix గ్లోబల్ ట్రెండింగ్‌లో సౌత్ సినిమాల హవా.. టాప్–10లో మూడు తెలుగు చిత్రాలు!
Netflix గ్లోబల్ ట్రెండింగ్‌లో సౌత్ సినిమాల హవా.. టాప్–10లో మూడు తెలుగు చిత్రాలు!
Netflix గ్లోబల్ ట్రెండింగ్‌లో సౌత్ సినిమాల హవా.. టాప్–10లో మూడు తెలుగు చిత్రాలు!

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో సౌత్ ఇండియన్ సినిమాల హవా కొనసాగుతోంది. సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లిష్ సినిమాల టాప్-10 జాబితాలో ఏకంగా మూడు సౌత్ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ముఖ్యంగా సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా.. రవితేజ ‘ఇరుముడి’, తమిళ చిత్రం ‘మొద రాత్రి’ కూడా గ్లోబల్ టాప్-10లోకి ఎంట్రీ ఇచ్చాయి.

నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన సెప్టెంబర్ 14–20 వారపు గ్లోబల్ నాన్-ఇంగ్లిష్ మూవీస్ రిపోర్ట్ ప్రకారం, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ 5.8 మిలియన్ వ్యూస్‌తో తొలి స్థానంలో నిలిచింది. 2 గంటల 40 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాను ఆ వారంలో భారీ సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. అంతకుముందు వారంలో 5.5 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో ఉన్న ఈ చిత్రం.. తాజా వారంలో మరింత పుంజుకుని నంబర్ వన్‌కు చేరుకుంది.

ఇక రవితేజ నటించిన ‘ఇరుముడి’కి కూడా గ్లోబల్‌గా మంచి స్పందన లభించింది. సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం.. కేవలం రెండు రోజుల్లోనే గ్లోబల్ నాన్-ఇంగ్లిష్ మూవీస్ లిస్ట్‌లో మూడో స్థానానికి చేరుకుంది. ఈ సినిమాకు 3.4 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.

తమిళ చిత్రం ‘మొద రాత్రి’ కూడా నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో సత్తా చాటింది. సెప్టెంబర్ 18న స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ మూవీ 1.9 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో నిలిచింది. రిషికాంత్, అనిష్మ అనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్ అందిస్తోంది.

Netflix టాప్-10 లిస్ట్ ఇదే..

  1. విశ్వనాథ్ అండ్ సన్స్ – 5.8 మిలియన్ వ్యూస్
  2. ది సీక్రెట్ ఉమెన్ – 3.6 మిలియన్ వ్యూస్
  3. ఇరుముడి – 3.4 మిలియన్ వ్యూస్
  4. గాంధారి – 3.1 మిలియన్ వ్యూస్
  5. ఫేసింగ్ El చాపో – 2.4 మిలియన్ వ్యూస్
  6. గో టీమ్ – 2.0 మిలియన్ వ్యూస్
  7. మొద రాత్రి – 1.9 మిలియన్ వ్యూస్
  8. ఆల్ఫా – 1.7 మిలియన్ వ్యూస్
  9. లస్ట్ స్టోరీస్ 3 – 1.5 మిలియన్ వ్యూస్
  10. ప్రాజెక్ట్ Sacrifice – 1.3 మిలియన్ వ్యూస్

ఈ లిస్ట్‌ను చూస్తే నాన్-ఇంగ్లిష్ కంటెంట్‌లో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలకు గ్లోబల్ ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ మరోసారి కనిపిస్తోంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నంబర్ వన్‌గా నిలవడంతో పాటు ‘ఇరుముడి’, ‘మొద రాత్రి’ కొత్తగా టాప్-10లోకి రావడం విశేషంగా మారింది.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← Bigg Boss Season 10: బిగ్ బాస్ 10లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. 'అగ్నిపరీక్ష 2' నుంచి ఆ ఇద్దరు హౌస్‌లోకి !Bengalore | మంత్రి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం.. బెంగ‌ళూరులోనే నిలిపివేత‌..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com