☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Bengalore | మంత్రి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం.. బెంగ‌ళూరులోనే నిలిపివేత‌..!

Bengalore | బెంగళూరు (Bengalore) నుంచి విజయవాడ (Vijayawada) కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (Air India Express Flight) లో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి (AP Minister) మండపల్లి రామప్రసాద్ రెడ్డి (Mandapally Ram Prasad Reddy) తోపాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్నారు.
Bengalore | మంత్రి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం.. బెంగ‌ళూరులోనే నిలిపివేత‌..!

Bengalore : బెంగళూరు (Bengalore) నుంచి విజయవాడ (Vijayawada) కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (Air India Express Flight) లో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి (AP Minister) మండపల్లి రామప్రసాద్ రెడ్డి (Mandapally Ram Prasad Reddy) తోపాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. టేకాఫ్‌ (Take Off) కు సిద్ధమైన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గుర్తించడంతో విమానాన్ని తిరిగి బే వద్దకు తీసుకువచ్చారు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX2875 విజయవాడకు బయలుదేరాల్సి ఉంది. వెలగపూడి సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి రామప్రసాద్ రెడ్డి ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. దాంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని రన్‌వే పైనుంచి వెనక్కి మళ్లించి బే వద్దకు తరలించారు.

విమానం తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందనే అంశంపై ఎయిర్‌లైన్స్ సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం లభించడం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారని, అంతవరకు వేచి ఉండాలని సిబ్బంది సూచించినట్లు సమాచారం. ఈ పరిణామంతో మంత్రి రామప్రసాద్ రెడ్డి ప్రయాణానికి అంతరాయం కలుగగా మిగిలిన ప్రయాణికులు కూడా విమానాశ్రయంలో నిరీక్షించాల్సి వస్తోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Netflix గ్లోబల్ ట్రెండింగ్‌లో సౌత్ సినిమాల హవా.. టాప్–10లో మూడు తెలుగు చిత్రాలు!Karnataka | యూఏఈ, షార్జాలో భార‌తీయుడి హ‌త్య‌.. తొమ్మిది ముక్క‌లుగా మృత‌దేహం.. ఆచూకీ లేని కొడుకు, భార్య‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com