☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Karnataka | యూఏఈ, షార్జాలో భార‌తీయుడి హ‌త్య‌.. తొమ్మిది ముక్క‌లుగా మృత‌దేహం.. ఆచూకీ లేని కొడుకు, భార్య‌

Karnataka : యూఏఈ, షార్జాలో దారుణం జ‌రిగింది. ఒక భార‌తీయ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. అత‌డి మృత‌దేహం తొమ్మిది ముక్క‌లుగా నరికి ఉంది. మ‌రోవైపు అత‌డి భార్య‌, కొడుకు ఆచూకీ ల‌భించ‌ లేదు.
Karnataka | యూఏఈ, షార్జాలో భార‌తీయుడి హ‌త్య‌.. తొమ్మిది ముక్క‌లుగా మృత‌దేహం.. ఆచూకీ లేని కొడుకు, భార్య‌

Karnataka : యూఏఈ, షార్జాలో దారుణం జ‌రిగింది. ఒక భార‌తీయ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. అత‌డి మృత‌దేహం తొమ్మిది ముక్క‌లుగా నరికి ఉంది. మ‌రోవైపు అత‌డి భార్య‌, కొడుకు ఆచూకీ ల‌భించ‌ లేదు. ఈ ఘ‌ట‌న గ‌త జూలైలో జ‌ర‌గ‌గా.. తాజాగా వెలుగు చూసింది. క‌ర్ణాట‌క‌, ఉడిపి జిల్లాలోని ఉద‌య‌వార్‌కు చెందిన అల్విన్ ప్ర‌కాష్ కుంద‌ర్ అనే వ్య‌క్తి 14 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. షార్జాలోని ఎయిర్‌పోర్టులో ప‌ని చేస్తున్నాడు. భార్య టీనీ కుంద‌ర్, టీనేజ్ కొడుకు కూడా అత‌డితోనే ఉంటున్నారు.

అయితే, గ‌త జూలై నుంచి ప్ర‌కాష్ కుంద‌ర్ ఎవ‌రికీ అందుబాటులోకి రాలేదు. చివ‌ర‌గా జూలై 20న ఇండియాలో ఉంటున్న ప్ర‌కాష్ సోద‌రుడు అనిల్.. ప్ర‌కాష్‌కు కాల్ చేశాడు. కానీ, ఎలాంటి స్పంద‌నా రాలేదు. అలా, ఫోన్ చేస్తుండ‌గా ఒక రోజు తాను బాగానే ఉన్న‌ట్లు మెసేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ప్ర‌కాష్‌కు వాట్సాప్ కాల్ చేసినా స్పంద‌నా రాలేదు. దీంతో షార్జాలో ఉంటున్న త‌న స్నేహితుడు మ‌నోహ‌ర్‌కు అనిల్ ఈ విష‌యం చెప్పాడు. దీంతో మ‌నోహ‌ర్.. ప్ర‌కాష్ ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అయితే, వారు ఇండియా వెళ్లిపోయిన‌ట్లు వాచ్‌మెన్ చెప్పాడు. త‌ర్వాత అత‌డు ప‌నిచేసే సంస్థ కార్యాల‌యానికి వెళ్లి ఆరా తీశాడు.

అక్క‌డ కూడా వారు.. అత‌డు ఇండియా వెళ్లిపోయిన‌ట్లు చెప్పారు. ఈ విష‌యాన్ని మ‌నోహ‌ర్.. త‌న స్నేహితుడు అనిల్‌కు చెప్పాడు. అయితే, వారు ఇండియాకు రాక‌పోవ‌డం.. షార్జాలో కూడా లేక‌పోవ‌డంతో చివ‌రికి మ‌నోహ‌ర్ ద్వారా షార్జాలో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులు ఆరా తీస్తుండ‌గా.. ప్రకాష్ కుంద‌ర్ మృత‌దేహం వారి ఇంట్లో ల‌భ్య‌మైంది. అది కూడా మృత‌దేహం తొమ్మిది ముక్క‌లుగా క‌నిపించింది. ఈ భాగాల్ని రెండు బ్యాగుల్లో దాచి ఉంచారు. భార్య‌, కొడుకు మాత్రం లేరు. ఘ‌ట‌న జ‌రిగిన జూలై నుంచి భార్య టీనా, కొడుకుకు సంబంధించిన వివ‌రాలేమీ తెలియ‌రాలేదు.

దీంతో ఈ అంశంపై క‌ర్ణాట‌క, ఉడుపి పోలీసుల‌కు అనిల్ ఫిర్యాదు చేశాడు. త‌న సోద‌రుడి మృత‌దేహాన్ని ఇండియా తీసుకురావ‌డంలో స‌హ‌క‌రించాల‌ని, అత‌డిని హ‌త్య చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో స‌హ‌క‌రించాల‌ని కోరారు. అయితే, ప్ర‌కాష్‌ను ఎవ‌రు హ‌త్య చేశారు.. ఎందుకు హ‌త్య చేశారు అనే వివ‌రాలు తెలియాల్సి ఉంది. మ‌రోవైపు.. అత‌డి భార్య‌, కొడుకు ఏమ‌య్యారో కూడా తేలాలి. ఇంకో ప్ర‌చారం ఏంటంటే.. భార్యే అత‌డిని హ‌త్య చేసి ఉండొచ్చ‌ని, ఆ త‌ర్వాత ఆమె త‌న కొడుకుతో పారిపోయి ఉండొచ్చ‌ని అనుమానాల్ని కుటుంబ స‌భ్యులు వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె ఇండియా వ‌చ్చిన‌ట్లు అనుమానిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bengalore | మంత్రి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం.. బెంగ‌ళూరులోనే నిలిపివేత‌..!Train Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com