Pacific Islands Forum : పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్‌లో (PIF) భారత్‌కు “వ్యూహాత్మక భాగస్వామ్య హోదా” లభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. న్యూయార్క్‌లో జరిగిన భారత్-ఎఫ్‌ఐపీఐసీ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఫిజీలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, 12 దేశాలకు 20 సముద్ర అంబులెన్స్‌ల అందజేత, 14 దేశాల్లో 2,800 గృహాలకు సౌర విద్యుత్ సరఫరా వంటి ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయి. ‘పసిఫిక్ దేశాల దీర్ఘకాలికాభివృద్ధి కోసం రూపొందించిన ‘2050 స్ట్రాటజీ ఫర్ ది బ్లూ పసిఫిక్ కాంటినెంట్’కు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు.
Read Also: Jamie Dimon : ఆంక్షలతో అమెరికాకే నష్టం ..జేపీ మోర్గాన్ సీఈఓ హెచ్చరిక..!

Pacific Islands Forum : . పసిఫిక్ ద్వీప దేశాలకు ఎల్ నినో తీవ్ర సవాళ్లు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధనం, కనెక్టివిటీ, సాంకేతికత, సామర్థ్య పెంపు వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని జైశంకర్ తెలిపారు. పసిఫిక్ ద్వీప దేశాలకు ఎల్ నినో తీవ్ర సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో, ఈ దృగ్విషయం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. అంతరిక్షం, సుస్థిర తీర, సముద్ర పరిశోధన రంగాల్లో సహకారాన్ని పెంచే ప్రయత్నాలను కూడా జైశంకర్ ప్రస్తావించారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమిలో చేరాలని పసిఫిక్ దేశాలను భారత్ ప్రోత్సహించిందని తెలిపారు. ఈ సంస్థల పరిధిలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Pleased to chair the India-FIPIC Foreign Ministers’ Meeting today in New York #UNGA81. Underlined the following:
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 23, 2026Our approach to the Pacific has consistently been demand-driven, development-oriented and people-centric.
India fully respects and supports the priorities… pic.twitter.com/hSFhG3gaKj
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
యెమెన్ జైలుపై సౌదీ వైమానిక దాడి.. 9 మంది ఖైదీలు మృతి


Our approach to the Pacific has consistently been demand-driven, development-oriented and people-centric. 



