The Paradise Movie: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు థియేటర్లతో పాటు సోషల్ మీడియాలోనూ విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో వర్సటైల్ నటుడు ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకర్’ పాత్ర ప్రేక్షకులలోనూ, నెటిజన్లలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also : The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ

The Paradise Movie: కేసీఆర్ శైలిని గుర్తుచేస్తున్న ప్రియదర్శి నటన
ఈ సినిమాలో ప్రియదర్శి ఒక పవర్‌ఫుల్ తెలంగాణ రాజకీయ నాయకుడి గెటప్‌లో కనిపించారు. ఆయన పలికించిన హావభావాలు, నటన, తెలంగాణ యాస ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని కీలక సన్నివేశాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలినట్లుగా ప్రియదర్శి బాడీ లాంగ్వేజ్, ప్రసంగాల శైలి ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగులపై “ఇరగదీశాడు” అంటూ ప్రశంసలు కురుస్తుండటంతో, ప్రియదర్శికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి.
‘ది ప్యారడైజ్’లో సీనియర్ ఎన్టీఆర్ పోలికలు?
సినిమాలో కేవలం కేసీఆర్ పోలికలే కాకుండా, ఇతర చారిత్రక నటులు, నాయకుల ఛాయలు కూడా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నటుడు విజయ్ కుమార్ పోషించిన పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ పోలికలు ఉన్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద నాని మాస్ యాక్షన్‌తో పాటు, ప్రియదర్శి క్యారెక్టరైజేషన్, ఇతర పాత్రల ప్రాధాన్యత ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
‘ప్యారడైజ్’కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది -నిర్మాత రవిశంకర్






