☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్​ ..శ్రీకాకుళంపై పెను ప్రభావం

Rains in Srikakulam District : తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు...
తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్​ ..శ్రీకాకుళంపై పెను ప్రభావం

Rains in Srikakulam District : తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకూలి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఒడిశా ఎగువ ప్రాంతాలతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు బహుదా, నాగావళి, వంశధార నదులు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. నందిగాం మండలం కొత్తఅగ్రహారం వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువ వంతెన కూలిపోవడంతో పదుల సంఖ్యలో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Read Also: NTR Baby Kit : ఏపీలో అమల్లోకి వచ్చిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ స్కీమ్

Rains in Srikakulam District
Rains in Srikakulam District

Rains in Srikakulam District : నీట మునిగిన పంటలు-రూపొందించిన పునరావాస కేంద్రాలు:

సోంపేట, పలాస, కవిటి సహా పలు మండలాల్లో సుమారు 12,022 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 115 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తీర ప్రాంత మండలాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశాలిచ్చారు. బుధవారం రాత్రి ఎచ్చెర్ల, రణస్థలం, గార, పోలాకి, సంతబొమ్మాళి మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు, ఆర్డీవోలతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. రేకులు, కచ్చా ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను తక్షణమే పునరావస కేంద్రాలు, సమీప బంధువుల సురక్షిత గృహాలకు తరలించాలని చెప్పారు. ఈ క్రమంలోనే నేడు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలకు పరిహారపు సెలవును ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అమరావతిలో FRRO కార్యాలయం.. విదేశీయుల సేవలకు కీలక ముందడుగు
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపునాని ‘ది ప్యారడైజ్’.. కేసీఆర్ పాత్రలో ఆకట్టుకున్న ప్రియదర్శి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com