Employee arrears : ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ పార్టీలు సహజంగా కొన్ని హామీలుస్తుంటాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఉద్యోగుల విష యంలో సమస్యలపై కొన్నిసార్లు ఆర్థిక స్థితిగతుల అంచనా ల ప్రకారం ప్రభుత్వాలు తాత్సారం చేసే పరిస్థితులు కొన సాగుతున్నాయి అనే భిన్న అభిప్రాయాలు అడపాదడపా వినిపిస్తుంటాయి. అయినప్పటికి సాధ్యమైనంతగా ప్రభుత్వాలు సామరస్యంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తుండడం సర్వసాధారణ మే. ఈ క్రమంలో తరచుగా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను ఉద్యోగస్తులు అడుగుతుంటారు. కొన్ని సందర్భా ల్లో చాలా సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య లను వీలైనంత త్వరగా పరిష్కరించే ధోరణితో ఉద్యోగ సం ఘాలతో చర్చలు జరిపే సమయంలో ప్రభుత్వాలు స్పష్ట మైన హామీ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేస్తుండడం సహజమే. రోజు రోజుకీ పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణం ఆధారంగా ఉద్యోగులకు సహజంగా రావలసినటువంటి పే రివిజన్ కమీషన్ గాని, డి.ఏ అంటే డియర్నెస్ అలవెన్సులు సకా లంలో రాకపోవడం ఒక ఎత్తు అయితే పదవి విరమణ పొందిన తర్వాత విరమణ పొందిన ఉద్యోగులకు రావలసిన ఆర్ధిక లావాదేవీలు సంపూర్ణంగా చేతికి అందకపోవడంతో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు నిరాశను కలిగిస్తు న్నాయి. ఇలాంటి విషయాలపై ప్రభుత్వాలలో భాగమైన ఉద్యోగస్తులు ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమవుతున్న తీరు శోచనీయమేమో.
Read Also : Bank Strike: బ్యాంకుల సమ్మె.. రేపే ఖాతాల్లో జీతాలు, పెన్షన్లు

Employee arrears : హామీలు నిష్ప్రయోజనంగానే గోచరి స్తున్నాయనే చర్చ
కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగుల బదిలీల విష యంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయని స్థాని కత, స్థానికేతర ఉద్యోగుల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని గతం నుండి ప్రభుత్వాలు తీసుకున్న జీవోలో ఉన్న స్పష్టత లేని అంశాలపై ఉన్న విషయాలు కాంట్రిబ్యూటెడ్ సీ.పి.ఎస్ పెన్షన్ స్కీం ప్రకారం ఉద్యోగ నియామకాలు ప్రస్తుతం జరుగుతున్నా ఉద్యోగం వచ్చిన తర్వాత వారు తిరిగి తమకు పాత పెన్షన్ విధానాన్ని ఓ.పి.ఎస్ అమలు చేయాలని ఉ ద్యోగుల విజ్ఞప్తి మేరకు సాధ్యాసాధ్యాలను పక్కనపెట్టి రాజకీయ పార్టీలు అధికారం లోకి వచ్చే ముందు నెరవేరుస్తామని హామీలను ఇస్తున్న ప్పటికీ, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఉద్యోగుల విషయం లో కొన్నిసందర్భాల్లో హామీలు నిష్ప్రయోజనంగానే గోచరి స్తున్నాయనే చర్చ ఉద్యోగ సంఘాల్లో సాగుతుంది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అనేక రకమైన టువంటి ఉద్యోగ సంఘాలు సంబంధిత శాఖలకు సంబంధించిన వారి సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్న వాదన తో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు వివిధ సంఘాల ఐక్య కార్యాచరణతో ఉద్యమ బాటను పడుతూ తరచుగా ప్రభు త్వాలతో చర్చలు విఫలమైన సందర్భాలలో కొన్ని సార్లు నిరసనలు వ్యక్తం చేస్తుండడం సాధారణమైపోయింది. ప్రభు త్వాలు ఉద్యోగ సంఘాల మధ్య జరుగుతున్న చర్చలుకొన్ని సార్లు కనీస స్థాయిలో నైనా సఫలం కాకపోవడం ఉద్యోగు లలో ఆందోళనలు కలిగిస్తుంది.
ఆర్థికపరమైన లావాదేవీలు అసంపూర్ణం
సర్వీస్లో ఉన్న ఉపాధ్యా యులతో సహా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు నిర్ణీత సమయంలో రావలసినటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు అంశాలు అసంపూర్ణంగా ఉంటున్నాయనే భావన పదవి విరమణ పొందిన ఉద్యోగులలో లేకపోలేదు. జీతాల పెంపు విష యమై వేతన సవరణ కమిషన్ల నివేదికలు కూడా అంది అందినట్టే ఉంటున్నాయి అనే భావన ఉద్యోగులలో లేకపో లేదు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అంశం చర్చనీ యాంశంగా మారుతుంది. అయితే గతంనుండి కూడాఉద్యో గుల విషయంలో సరైన రీతుల్లో ప్రభుత్వాలు స్పందించక పోవడం ఒక ఎత్తు అయితే కారణాలేవైనా ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ విషయంలో కొంత జాప్యం చేస్తున్నాయి అనే వాదనలు వినిపిస్తుంటా యి. మరీ ముఖ్యంగా చాలా సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్లో ఉండి పదవీ విరమణ పొందిన వారి పరిస్థితి ప్రస్తుతమున్న పరిస్థితులు విశ్రాంతిగా కుటుంబ సభ్యులతో కాలం గడిపే సమయంలో తమకు రావాల్సిన ప్రభుత్వ బకాయిలు గురించి ఆలోచిస్తూ సంబంధిత కార్యాలయం చుట్టూ తిరుగుతు ఉన్న సందర్భాల్లో ప్రస్తుతం అందుకే విశ్రాంత ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా ఉంటున్నారని అనిపిస్తుంది. కారణాలేవైనా ప్రభుత్వాలు న్యాయపరమైన ఉద్యోగుల సమస్యలను సత్వరమే త్వరితగతిన పరిష్కరిం చాలి.

ప్రభుత్వాలతో అవిశ్రాంతంగా పోరాటం
ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వంసామ రస్యంతో పరిష్కరించే రీతిలో కొన్ని ఉన్నప్పటికీ, మరికొన్ని అంశాలు ఆర్థిక స్థితిగతులపై ముడిపడి ఉండడం వల్ల ప్రభు త్వ ఉద్యోగులు అనుకున్న రీతిలో సమస్యల పరిష్కారం ఆశించిన స్థాయిలో లేకపోవడం జరుగుతుందనే విభిన్నమైన అభిప్రాయాలు లేకపోలేదు. అయితే ఐదేళ్లకోసారి ప్రభుత్వా లు మారుతున్నా, ఇందుకు భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయస్సు వరకు ఉద్యోగంలో పనిచేస్తుంటారు. ఈక్రమంలో ప్రభుత్వ విధానాలను అమలు పరుస్తుం టారు. దేశ రాష్ట్ర ఆర్థికవిధానాలు ప్రజా సంక్షేమ అభివృద్ధి వివిధ వ్యవస్థల్లో సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల కొరకు తీసుకునే నిర్ణయాత్మక అభివృద్ధి ప్రణాళికలో కీలకపాత్ర ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వాలు స్వచ్ఛమైన పరిపాలనను అందించే రీతిలో ఉద్యోగుల పాత్ర కూడా కీలకమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో పదవీ విరమణ పొందిన తర్వాత ఉద్యోగులకు రావలసిన ఆర్ధిక లావాదేవీలు సకాలంలో సంపూర్ణంగా చేతికి అందక పోవడంతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు నిరాశను కలిగిస్తున్నాయి. అనేక సంవత్సరాలు ప్రభుత్వ శాఖల్లో సేవలు అందించి పదవీ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకో వాల్సిన సమయంలో రావలసిన బకాయిల గురించి ప్రభు త్వాలతో అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న క్రమం విశేషం. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగుల సమ స్యల పరిష్కారానికి ప్రస్తుత ప్రభుత్వాలు సమన్వయంతో, సామరస్యంతో సానుకూల ధోరణికలిగి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్త శుద్ధితో మరింతగా కృషి చేయాలి.
-దాడిశెట్టి శ్యామ్ కుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
యూపీఐ కొత్త ఛార్జీలపై ఎన్‌పీసీఐ క్లారిటీ.. చిన్న వ్యాపారులకు ఊరట


