The Paradise Movie: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ గురువారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. అయితే సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఇందులోని ఒక కీలక పాత్ర చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చ మొదలైంది. ఈ చిత్రంలో వర్సటైల్ నటుడు ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకర్ అన్న’ పాత్ర, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను పోలి ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read Also : The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ

The Paradise Movie: కేసీఆర్ బాడీ లాంగ్వేజ్‌తో ‘శంకర్ అన్న’ పాత్ర?
సినిమాలో ప్రియదర్శి గెటప్, ఆయన మాట్లాడే యాస, సంభాషణలు చెప్పే విధానం, బాడీ లాంగ్వేజ్ అచ్చం కేసీఆర్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్‌లు, సీన్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారడంతో ఈ పాత్రను ప్రత్యేకంగా కేసీఆర్ ఆధారంగానే రూపొందించారా అనే ఊహాగానాలు షురూ అయ్యాయి. కథలో ఈ శంకర్ అన్న పాత్ర చాలా కీలకమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నట్లు సమాచారం.
థియేటర్‌లో కేసీఆర్ మనవడు హిమాన్షు
ఒకవైపు కేసీఆర్‌ను పోలిన పాత్రపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తుండగానే, కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు థియేటర్‌లో ఈ సినిమాను వీక్షించడం విశేషం. సాధారణ అభిమానుల మధ్య కూర్చుని హిమాన్షు ‘ది ప్యారడైజ్’ సినిమా చూస్తున్న వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ పరిణామం సినీ, రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.
ఎన్టీఆర్ పాత్ర, గద్దర్‌కు నివాళి?
ప్రియదర్శి పాత్ర వివాదంతో పాటు ఈ సినిమాలో మరికొన్ని ఆసక్తికర అంశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీ రామారావు (ఎన్టీఆర్)కు సంబంధించిన ఒక ప్రత్యేక పాత్ర లేదా సూచన ఈ చిత్రంలో ఉందనే టాక్ వినిపిస్తోంది. అమర గాయకుడు గద్దర్‌కు ఈ సినిమా ద్వారా చిత్రబృందం నివాళి అర్పించిందని తెలుస్తోంది.
ఈ అంశాలన్నింటి కలబోతగా ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రస్తుతం పొలిటికల్ అండ్ టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పాత్రలు, పోలికలపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత గానీ, ప్రకటన గానీ రావలసి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
నాని ‘ది ప్యారడైజ్’.. కేసీఆర్ పాత్రలో ఆకట్టుకున్న ప్రియదర్శి






