☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

చిన్న వయసులోనే పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు

Young Stroke : సాధారణంగా పక్షవాతం అనేది వృద్ధాప్యానికి సంబంధించిన సమస్యగా పరిగణిస్తాం. ఇటీవలి పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని మారుస్తున్నాయి. గత మూడు దశాబ్దాల్లో 20 నుంచి...
చిన్న వయసులోనే పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు

Young Stroke : సాధారణంగా పక్షవాతం అనేది వృద్ధాప్యానికి సంబంధించిన సమస్యగా పరిగణిస్తాం. ఇటీవలి పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని మారుస్తున్నాయి. గత మూడు దశాబ్దాల్లో 20 నుంచి 54 ఏండ్ల వయస్సు గల వారిలో పక్షవాతం సంభవించే రేటు దాదాపు రెట్టింపయ్యిందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీనిపై అమెరికాలో చేపట్టిన అధ్యయన వివరాలు సెప్టెంబర్‌ 23న న్యూరాలజీ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయన వివరాలు 1993 నుంచి 2020 మధ్య కాలంలో గ్రేటర్‌ సిన్సినాటి, ఉత్తర కెంటకీ ప్రాంతాలకు చెందినవి. 20 నుంచి 54 ఏండ్ల వయసు గల వారిలో మొదటిసారి పక్షవాతం వచ్చిన 2076 కేసులను గుర్తించారు. లక్షకు 33.9 కేసులు నమోదవగా, 2020 నాటికి అది 62.2కు చేరింది. ఇస్కీమిక్‌ స్ట్రోక్స్‌ కేసులే ఎక్కువగా ఉన్నాయి. అంటే మెదడులో ఏర్పడిన బ్లడ్‌ క్లాట్‌ లేదా ఇతర ఏదైనా ఇతర ఏదైనా అవరోధం ఒక భాగానికి రక్త ప్రసరణను అడ్డుకోవడం వల్ల ఇది సంభవిస్తుంది. ఈ రకమైన పక్షవాతం ఈ అధ్యయనం కాలంలో లక్షకు 23.8 నుంచి 47.3 కేసులకు పెరిగింది. అయితే పరిశోధకులు ఇంట్రాసెరెబ్రల్‌ లేదా సబర్నకాయిడ్‌ హేమరేజెస్‌ విషయంలో ఇలాంటి పెరుగుదలను గుర్తించలేదు.

Read Also : Sleeping : మానసిక ఆందోళన, డిప్రెషన్‌కు దారితీస్తున్న క్రమం లేని నిద్ర వేళలు

Young Stroke
Young Stroke

Young Stroke : పెరిగిన కొలెస్ట్రాల్‌, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు వేగంగా పెరగడం

యువకుల్లో ఈ పక్షవాతం పెరుగుదలలకు సరైన కారణాన్ని పరిశోధకులు ఇప్పటివరకు గుర్తించలేదు. కానీ పక్షవాతానికి గురైన యువకుల్లో ఎక్కువగా మధుమేహం, అట్రియల్‌ ఫైబ్రిలేషన్‌, అధిక బీపీ ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు మత్తు పదార్థాల వినియోగం వల్ల కూడా ఈ పక్షవాతం సంభవిస్తున్నట్లు గమనించారు. వీటి వినయోగం 1993-94లో 4.6 శాతం నుంచి 2020 నాటికి 40.2 శాతానికి పెరిగింది. దీనిలో అధిక భాగం గంజాయి వాడకం వల్లనే సంభవింయింది. ఈ అధ్యయనం ఒక్క అమెరికాకే కాకుండా ప్రపంచంలోని 204 దేశాలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా 1990 నుంచి 2021 మధ్య 15 నుంచి 49 ఏండ్ల సంవత్సరాలు గల వారిలో పక్షవాత కేసులు 36 శాతం పెరిగినట్లు గుర్తించారు. దీనికి అధిక సిస్టోలిక్‌ బీపీ, అధిక బాడీ మాస్‌ ఇండెక్స్‌ , పెరిగిన కొలెస్ట్రాల్‌, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు వేగంగా పెరగడం, వాయు కాలుష్యం వంటివి కారణాలు అని పరిశోధకులు వెల్లడించారు. అధ్యయనాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ వయసుతో సంబంధం లేకుండా వచ్చే అకస్మాత్తుగా వచ్చే నాడీ సంబంధిత వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదు. అకస్మాత్తుగా వచ్చే నీరసం లేదా తిమ్మిరి, శరీరంలోని ఒకవైపునకు ముఖం వాలిపోవడం, వదలని తలనొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది, అకస్మాత్తుగా దృష్టిలోపాలు, తల తిరగడం వంటి పక్షవాతానికి సంకేతాలు కావచ్చు. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ఎముకల సాంద్రతను పెంచే పోషకాల గని
⬇ Full News JPG⬇ Short News JPG
← Faria Abdullah : బ్లాక్ డ్రెస్‌లో ఫరియా అబ్దుల్లా.. క్యూట్ స్మైల్.. ఫోటోలు వైర‌ల్థియేటర్‌లో ‘ది ప్యారడైజ్’ చూసిన కేసీఆర్ మనవడు హిమాన్షు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com