☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

ఏపీలో అమల్లోకి వచ్చిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ స్కీమ్

NTR Baby Kit : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులు మరియు నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
ఏపీలో అమల్లోకి వచ్చిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ స్కీమ్

NTR Baby Kit : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులు మరియు నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిచిపోయిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ పథకాన్ని పునరుద్ధరిస్తూ అధికారికంగా అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ వైద్యశాలల్లో జన్మించే ప్రతీ పసిపాపకు మెరుగైన సంరక్షణ అందించడంతో పాటు, బాలింతలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలను సమకూర్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించి, ఆసుపత్రులలో కాన్పుల సంఖ్యను మరింత పెంచేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

Read Also : అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

రూ.1,400 విలువైన 14 రకాల అత్యవసర వస్తువులు

ఈ పథకం కింద ప్రతి బాలింతకు రూ.1,400 విలువ చేసే 14 రకాల వస్తువులతో కూడిన ఒక సమగ్రమైన కిట్‌ను ఉచితంగా అందజేస్తారు. ఇందులో శిశువు సురక్షిత నిద్ర కోసం దోమల తెరతో కూడిన ప్రత్యేక బేబీ బెడ్, ప్రొటెక్టివ్ రబ్బర్ షీట్, మెత్తని బేబీ డ్రెస్, టవల్, ఉతికి మళ్లీ ఉపయోగించగల (వాషబుల్) 3 బేబీ నేపీలు, ఆకర్షణీయమైన బొమ్మతో పాటు నాణ్యమైన బేబీ పౌడర్, షాంపూ, ఆయిల్, సోప్, సోప్ బాక్స్ మరియు ఇవన్నీ భద్రపరుచుకోవడానికి వీలుగా ఒక బ్యాగ్ ఇస్తారు. పురిటిపాపల పారిశుధ్యం, ఆరోగ్య భద్రతకు అవసరమైన అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభించనుండటంపై బాలింతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అమరావతిలో FRRO కార్యాలయం.. విదేశీయుల సేవలకు కీలక ముందడుగు
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బ్యాంకుల సమ్మె.. రేపే ఖాతాల్లో జీతాలు, పెన్షన్లుప్రముఖ డైరెక్టర్ SS రవిచంద్ర కన్నుమూత →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com