☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

ప్రముఖ డైరెక్టర్ SS రవిచంద్ర కన్నుమూత

Sarika Satya Ravichandra Passes Away: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సీనియర్ దర్శకుడు సారిక...
ప్రముఖ డైరెక్టర్ SS రవిచంద్ర కన్నుమూత

Sarika Satya Ravichandra Passes Away: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సీనియర్ దర్శకుడు సారిక సత్య రవిచంద్ర (84) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

చిత్ర పరిశ్రమ ప్రయాణం మరియు అగ్ర హీరోలతో విజయాలు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రవిచంద్రకు చిన్నతనం నుంచే సినిమా రంగంపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె. రాఘవేంద్రరావు వంటి దిగ్గజ దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసి దర్శకత్వ శాఖపై పట్టు సాధించారు. నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ ప్రోత్సాహంతో హిందీ ‘ఖైదీ’ చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన, ఆ తర్వాత తెలుగులో కృష్ణతో ‘రౌడీ నంబర్ వన్’, ‘కిరాయిగూండా’, ‘సార్వభౌముడు’, ‘దొరగారికి దొంగపెళ్లాం’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.

Read also: The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ

Sarika Satya Ravichandra Passes Away: వివిధ భాషల్లో చిత్రాల నిర్మాణం మరియు అంత్యక్రియల వివరాలు

కేవలం తెలుగుకే పరిమితం కాకుండా నందమూరి బాలకృష్ణతో ‘దేశోద్ధారకుడు’, ‘అశోక చక్రవర్తి’, విక్టరీ వెంకటేష్‌తో ‘అగ్గిరాముడు’, ‘విజేత విక్రమ్’ చిత్రాలను రూపొందించారు. అంతేకాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘మహాగురు’తో సహా మొత్తం 6 హిందీ సినిమాలకు, ఒక కన్నడ చిత్రానికి కూడా ఆయన దర్శకత్వం వహించి బహుభాషా ప్రతిభను చాటుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉండగా, సోదరుడు, ప్రముఖ నటుడు సారిక రామచంద్రరావు వివరాల ప్రకారం ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే జరగనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆ థియేటర్‌లో సినిమా చూస్తా.. అనుమతివ్వండి: సీఎం రేవంత్‌కు హీరో నాని విజ్ఞప్తి
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఏపీలో అమల్లోకి వచ్చిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ స్కీమ్Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com