☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజాయ్ లీలా భన్సాలీ భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. రామ్ లీల, బాజీరావ్ మస్తానీ, గంగూభాయ్ వంటి వరుస హిట్స్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణబీర్ కపూర్, అలియాభట్, విక్కీ కౌశల్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రణబీర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి కథానాయకుడు రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. […]
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజాయ్ లీలా భన్సాలీ భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. రామ్ లీల, బాజీరావ్ మస్తానీ, గంగూభాయ్ వంటి వరుస హిట్స్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణబీర్ కపూర్, అలియాభట్, విక్కీ కౌశల్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రణబీర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి కథానాయకుడు రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. వింటేజ్ అవతార్‌లో రణబీర్ కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మార్కెట్ టార్గెట్ చేయాలనుకుంటున్నాడట భన్సాలీ. యానిమల్, ఛావాతో టాలీవుడ్‌లో రణబీర్, విక్కీ ఫేమ్ తెచ్చుకున్న నేపథ్యంలో ఇలా ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు ప్రస్తుతం రణబీర్ కపూర్ నటించిన రామాయణ నవంబర్ 6న రిలీజ్ కు రెడీ అవుతోంది. కేవలం మూడు నెలల గ్యాప్ లో రణబీర్ నుండి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రామాయణలో రాముడిగా లవ్ అండ్ వార్ లో లవర్ బాయ్ గా రణబీర్ వేరియషన్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. లవ్ అండ్ వార్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ప్రముఖ డైరెక్టర్ SS రవిచంద్ర కన్నుమూతCM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com