☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

ఆజమ్‌గఢ్‌లో ఘోరం: పూజ వివాదంలో భార్య, పురోహితుల హత్య

Horrific incident in Azamgarh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజమ్‌గఢ్ జిల్లా శంభుపూర్ ఘాజీ గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించిన కాల్పుల ఘటన ఎట్టకేలకు పోలీసుల ఎన్‌కౌంటర్‌తో...
ఆజమ్‌గఢ్‌లో ఘోరం: పూజ వివాదంలో భార్య, పురోహితుల హత్య

Horrific incident in Azamgarh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజమ్‌గఢ్ జిల్లా శంభుపూర్ ఘాజీ గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించిన కాల్పుల ఘటన ఎట్టకేలకు పోలీసుల ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. ఇంట్లో జరుగుతున్న పూజ విషయంలో తలెత్తిన వివాదం చివరకు నలుగురి ప్రాణాలను తీసింది. దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిన ఈ హై-వోల్టేజ్ డ్రామా చివరకు తుపాకీ మోతలతో ముగిసింది. అహ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభుపూర్ ఘాజీ గ్రామానికి చెందిన అరవింద్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం మార్కెట్ నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. ఆ సమయంలో అతడి ఇంట్లో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న పూజా కార్యక్రమం జరుగుతోంది. పూజ నిర్వహిస్తున్న ఇద్దరు పురోహితులను అరవింద్ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. పూజ నిర్వహణపై అతడికి ఉన్న అభ్యంతరాల కారణంగా భార్య బబితా సింగ్‌తో కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో రగిలిపోయిన అరవింద్ సింగ్ తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనలో అతడి భార్య బబితా సింగ్‌తో పాటు పూజ నిర్వహిస్తున్న ఇద్దరు పురోహితులు అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందారు. కాల్పుల శబ్దం విని గ్రామస్తులు పరుగులు తీయడంతో, అరవింద్ వెంటనే తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఓ గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకున్నాడు.

Read Also: Jharkhand Drowning Incident: నిమజ్జన వేడుకల్లో విషాదం..నదిలో గల్లంతైన ఐదుగురు మృతి

Horrific incident in Azamgarh
Horrific incident in Azamgarh

Horrific incident in Azamgarh : 7 గంటల ఉత్కంఠ – కమాండోల రెస్క్యూ ఆపరేషన్

సమాచారం అందుకున్న వెంటనే ఆజమ్‌గఢ్ ఎస్పీ డాక్టర్ అనిల్ కుమార్, ఎస్పీ రూరల్ చిరాగ్ జైన్ నేతృత్వంలో ఆరు పోలీస్ స్టేషన్ల బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గదిలో బంధీలుగా ఉన్న పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా పోలీసులు నిందితుడితో చర్చలు జరిపేందుకు, అతడిని లొంగిపోవాలని కోరేందుకు గంటల తరబడి ప్రయత్నించారు. అయితే అరవింద్ ఏమాత్రం స్పందించలేదు. రాత్రి 11.30 గంటల సమయంలో వారణాసి జోన్ ఏడీజీ నవీన్ అరోరా స్వయంగా వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితి తీవ్రతను బట్టి అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక కమాండో బృందాన్ని రంగంలోకి దించారు.కమాండోలు చివరిసారిగా లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ, అరవింద్ వారిపైకి సుమారు ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో కమాండోలు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు ప్రారంభించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ కాల్పుల్లో అరవింద్ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల అనంతరం గదిలోకి వెళ్లిన కమాండోలు గాయపడిన అరవింద్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గదిలో ఉన్న పిల్లలలో ఒక బాలుడికి గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నచ్చిన యువతితో పెళ్ళికి కుటుంబ సభ్యులు నో చెప్పడంతో కానిస్టేబుల్ ఆత్మహత్య
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఇది ముమ్మాటికి జూరాల రైతుల విజయంమీరాబాయి చాను సత్తా.. భారత్ ఖాతాలో రజత పతకం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com