☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

ఇది ముమ్మాటికి జూరాల రైతుల విజయం

Former Minister Laxma Reddy: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు విడుదల కావడం ముమ్మాటికి అన్నదాతల పోరాట విజయమని మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి...
ఇది ముమ్మాటికి జూరాల రైతుల విజయం

Former Minister Laxma Reddy: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు విడుదల కావడం ముమ్మాటికి అన్నదాతల పోరాట విజయమని మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఎనిమిది రోజులుగా అన్నదాతలు, విపక్షాలు చేసిన నిరంతర ఆందోళనలు, ధర్నాలకు తలొగ్గి ప్రభుత్వం దిగొచ్చి కాలువ గేట్లు ఎత్తాల్సి వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ సర్కారు రైతులను అనవసర గందరగోళానికి గురిచేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు.

వానాకాలం ముగిసేవరకు నిరంతరాయంగా నీరందించాలి

ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా నీటి విడుదలను నిలిపివేయడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతాయేమోనన్న భయంతో రైతులు తీవ్ర ఆవేదన చెందారని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అనాలోచిత, బాధ్యతారహిత నిర్ణయాల వల్లే ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి నీటిని విడుదల చేయడం మంచి పరిణామమని, కేవలం తాత్కాలికంగా కాకుండా ప్రస్తుత వానాకాలం సీజన్ పంటలు పూర్తయ్యే వరకు ఆయకట్టుకు నిరంతరాయంగా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

Former Minister Laxma Reddy: రైతుల పక్షాన నిలిచింది బీఆర్‌ఎస్ పార్టీయే

రాజకీయాలకు అతీతంగా బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతాంగానికి కొండంత అండగా నిలబడుతుందని లక్ష్మారెడ్డి తెలిపారు. అందుకే తాము రైతులకు మద్దతుగా ధర్నాకు పిలుపునిచ్చామని, ఈ ఒత్తిడి వల్లే ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు. గతంలో కృష్ణా నదిలో వరద ప్రారంభమైనప్పుడు కూడా బీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నాల ఫలితంగానే రైతులకు సకాలంలో సాగునీరు అందిందని ఆయన గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాలను కాలరాసే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, చివరి ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు

Former Minister Laxma Reddy

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎట్టకేలకు జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← చెరువులో కారు నిలిపి మద్యం మత్తులో యువకులు: వర్షంతో పెరిగిన నీరుఆజమ్‌గఢ్‌లో ఘోరం: పూజ వివాదంలో భార్య, పురోహితుల హత్య →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com