☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

చెరువులో కారు నిలిపి మద్యం మత్తులో యువకులు: వర్షంతో పెరిగిన నీరు

Viral News : తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని కుమారచెట్టి గ్రామంలో వింతైన, అత్యంత ప్రమాదకరమైన ఘటన వెలుగు చూసింది. వినోదం కోసం ఇద్దరు యువకులు...
చెరువులో కారు నిలిపి మద్యం మత్తులో యువకులు: వర్షంతో పెరిగిన నీరు

Viral News : తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని కుమారచెట్టి గ్రామంలో వింతైన, అత్యంత ప్రమాదకరమైన ఘటన వెలుగు చూసింది. వినోదం కోసం ఇద్దరు యువకులు చేసిన పిచ్చి పని వారి ప్రాణాల మీదికే తెచ్చింది. నీళ్లు లేని చెరువు మధ్యలోకి వాహనం తీసుకెళ్లి మద్యం సేవించడం, ఆపై ముంచెత్తిన వర్షంతో వాహనం నీట మునిగిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 20న అర్ధరాత్రి వేళ ఇద్దరు స్నేహితులు తమ మహీంద్రా థార్ వాహనంలో కుమారచెట్టి గ్రామంలోని చెరువు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో చెరువులో నీటిమట్టం చాలా తక్కువగా ఉండటంతో, విచిత్రమైన ఆలోచనతో వాహనాన్ని ఏకంగా చెరువు మధ్యలోకి తోలుకెళ్లారు. చెరువు లోపల కారును పార్క్ చేసి ఫుల్లుగా మద్యం తాగారు.ఆల్కహాల్ మత్తు ఎక్కువ కావడంతో, బయటకు రావాలనే స్పృహ కూడా లేకుండా ఆ వాహనంలోనే ఇద్దరూ నిద్రపోయారు.

Read Also: UP Rajya Sabha Election 2026:10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు.. అక్టోబర్ 16న పోలింగ్

Viral News
Viral News

Viral News : అర్ధరాత్రి కుండపోత వర్షం – ప్రాణాల భయంతో కేకలు

ఇద్దరు యువకులు నిద్రపోతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. దాంతో ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చెరువులోకి చేరింది. చెరువులో నీటిమట్టం వేగంగా పెరిగి థార్ వాహనం సగానికి పైగా మునిగిపోయింది.వాహనంలోకి నీరు చేరడంతో యువకులకు మత్తు వదిలి మెలకువ వచ్చింది. కారులోంచి బయటకు రావడం సాధ్యం కాకపోవడంతో భయపడిపోయిన యువకులు వాహనం పైకప్పు (టాప్) పైకి ఎక్కి కాపాడాలంటూ గట్టిగా అరిచారు. యువకుల ఆర్తనాదాలు విన్న కుమారచెట్టి గ్రామస్తులు అర్ధరాత్రి వేళ వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని, సమయస్ఫూర్తితో ఒక పొక్లెయిన్ (జేసీబీ) యంత్రాన్ని ఘటనా స్థలానికి రప్పించారు. తాడు సహాయంతో థార్ వాహనాన్ని, యువకులను సురక్షితంగా ఒడ్డుకు లాగారు. ఈ ప్రమాదం నుంచి యువకులు సురక్షితంగా బయటపడటంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కర్ణాటకలో ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← షార్జాలో ఉడుపి వ్యక్తి దారుణ హత్యఇది ముమ్మాటికి జూరాల రైతుల విజయం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com