☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

ఉద్యోగాలు కల్పించే విద్య కావాలి

Education that creates jobs : ఉన్నత విద్యలో ఒకప్పుడు ప్రధాన ప్రశ్న ‘విద్యార్థి ఏ డిగ్రీ పొందాడు? అనేది. ఇప్పుడు దానికి మరో ప్రశ్న తప్పనిసరిగా...
ఉద్యోగాలు కల్పించే విద్య కావాలి

Education that creates jobs : ఉన్నత విద్యలో ఒకప్పుడు ప్రధాన ప్రశ్న ‘విద్యార్థి ఏ డిగ్రీ పొందాడు? అనేది. ఇప్పుడు దానికి మరో ప్రశ్న తప్పనిసరిగా జతకావాలి, ‘ఆ డిగ్రీతో అతను ఏ పని చేయగ లడు?. ఉద్యోగ ప్రపంచం వేగంగా మారుతున్న సమయంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేని విద్యావ్యవస్థపై కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, డిజి టల్ టెక్నాలజీలు, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక తయారీ వంటి రంగాలు ఉద్యోగాల స్వభా వాన్నే మార్చుతున్నాయి. ఈ పరిస్థితిలో విద్యార్థికి కేవలం పుస్తక జ్ఞానం కాకుండా, ఆ జ్ఞానాన్ని పనిలోకి మార్చగల సామర్థ్యం ఇవ్వడం ఉన్నత విద్య ముందున్న ప్రధాన బాధ్యతగా మారింది. ఈ నేప థ్యానికే ఆంధ్రప్రదేశ్లో స్కిల్ యూనివర్సిటీల ఆలోచన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీల (స్థాపన, క్రమబద్ధీకరణ) బిల్లు 2026ను రాష్ట్ర శాసనసభ ఆగస్టు 19, 2026న ఆమో దించింది. అనంతరం శాసనమండలిలోనూ ఆమోదం పొం దిన ఈబిల్లు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య ఆధారిత విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్ట పర మైన వ్యవస్థను కల్పించే దిశగా అడుగువేసింది. గ్రీన్ఫీల్డ్ తోపాటు బ్రౌన్ఫల్డ్ స్కిల్ యూనివర్సిటీలకు అవకాశంకల్పిం చడం, ఇప్పటికే ఉన్న ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇతర అర్హత కలిగిన సంస్థలను స్కిల్ యూనివర్సిటీలుగా మార్చే అవకా శం ఇవ్వడం ఇందులోని ముఖ్య అంశాలు. ఈ ఆలోచనలో అసలు మార్పు ‘స్కిల్’ అనే పదాన్ని ఒక ప్రత్యేకశిక్షణ కార్య క్రమంగా కాకుండా విశ్వవిద్యాలయ విద్యలోనే ఒక ప్రధాన భాగంగా చూడటంలో ఉంది.

Read Also : Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో 9:30లోపే టిఫిన్ పూర్తి చేయాలి.. విద్యాశాఖ ఆదేశాలు

Education that creates jobs
Education that creates jobs

Education that creates jobs : విద్యను పరిశ్రమ అవసరాలతో అనుసంధానిస్తూ..

సాంప్రదాయ డిగ్రీలో తరగ తులు, సెమిస్టర్లు, పరీక్షలు, మార్కులు ప్రధానంగా ఉంటే, స్కిల్ యూనివర్సిటీలో నేర్చుకోవడం, చేయడం, సమస్య పరిష్కరించడం, పరిశ్రమలో అనుభవం పొందడం, ఆ అను భవాన్ని విద్యా క్రెడిట్గా గుర్తించడం వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం రావాలి. భారతదేశంలో హర్యానాకు చెందిన శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ తన విద్యను పరిశ్రమ అవసరాలతో అనుసంధానిస్తూ, ప్రాక్టికల్ లెర్నింగ్, ఇంటర్న్ షిప్, అప్రెంటిస్పివ్, ఆనే జాబ్ ట్రైనింగ్ వంటి విధానాల ను ప్రోత్సహిస్తోంది. మహారాష్ట్రలోని సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా పరిశ్రమ భాగస్వా మ్యాలు, ( ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, ప్రాక్టికల్ శిక్షణ, సర్టి ఫికెట్ నుంచి డాక్టోరల్ స్థాయివరకు పలు మార్గాలను అంది స్తోంది. అంటే స్కిల్ యూనివర్సిటీ అనేది కేవలం ‘చిన్న కాలిక వృత్తి శిక్షణ సంస్థ’ కాదని స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిం చిన నమూనాలో పరిశ్రమను కేవలం ప్లేస్మెంట్ ఇచ్చే సంస్థగా కాకుండా విద్యా భాగస్వామిగా చూడాల్సిన అవ సరం ఉంది. పరిశ్రమ ప్రతినిధులు పాఠ్య ప్రణాళిక రూప కల్పనలో పాల్గొనాలి. ఏ నైపుణ్యాలకు డిమాండ్ ఉందో వారు చెప్పాలి. అవసరమైన పరికరాలు, సాఫ్ట్వేర్, సిమ్యు లేటర్లు, శిక్షణా ప్రమాణాలు నిర్ణయించడంలో భాగస్వాము లు కావాలి. విద్యార్థులకు అప్రెంటిన్షిప్, ఆన్ద్విజాబ్ ట్రైనింగ్, పరిశ్రమ ప్రాజెక్టులు కల్పించాలి.

శిక్షణ కేంద్రాలు ఏర్పాటు

ఒక విద్యార్థి కోర్సు పూర్తిచేసే సమయానికి కనీసం కొంత వాస్తవిక పని అనుభవం కూడా సంపాదించి ఉండేలా విద్యా నిర్మాణం ఉండాలి. ఇక్కడే ‘హబ్ అండ్ స్పోక్’ నమూనా ప్రాధాన్యం పొందుతుంది. ఒక ప్రధాన విశ్వవిద్యాలయాన్ని అకడమిక్ హబ్ ఉంచి, వివిధ ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తే నైపుణ్య విద్యను జిల్లాల స్థాయికి తీసుకెళ్లవచ్చు. పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు, పోర్టులు, లాజిస్టిక్స్ కేంద్రాలు, తయారీ క్లస్టర్లు, ఆక్వా కల్చర్ ప్రాంతాలు, సేవా రంగ కేంద్రాలకు దగ్గరగా శిక్షణా కేంద్రాలు ఏర్పడితే విద్యార్థికి శిక్షణ పొందే స్థలం ఉద్యోగం లభించే స్థలం మధ్య దూరం తగ్గుతుంది. ఈవిధానం గ్రామీణ, తీర ప్రాంత యువతకు ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశముంది. అయితే స్కిల్ యూనివర్సి టీలు ఏర్పడటం మాత్రమే సరిపోదు. ఏ రంగాల్లో కోర్సులు ప్రారంభించాలి అనే నిర్ణయం విద్యార్థుల ప్రస్తుత ఆసక్తిని బట్టి కాకుండా, భవిష్యత్తు ఉ ద్యోగ మార్కెట్ను అంచనా వేసి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల విస్తరణ, పోర్టులు లాజిస్టిక్స్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, డ్రోన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, పునరుత్పాదక ఇంధనం, ఆహార ప్రాసెసింగ్, ఆక్వాకల్చర్, ఆరోగ్య సేవలు, పర్యాటకం వంటి రంగాల్లో పెరుగుతున్న అవకాశాలకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్య కోర్సులను రూపొందించవచ్చు.

ప్రైవేట్ పెట్టుబడికి అవకాశం కల్పించడం

అయితే పరిశ్రమల అవసరాలు మారు తున్నందున పాఠ్యప్రణాళికలను కూడా నిర్దిష్ట కాల వ్యవధి లో పునఃసమీక్షించే విధానం అవసరం. స్కిల్ యూనివర్సి టీలు విజయవంతం కావాలంటే ‘కోర్సు పూర్తి చేసిన విద్యా ర్థుల సంఖ్య’ కంటే ‘కోర్సు పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు ‘ఏమయ్యారు?’ అనే ప్రశ్నకు ప్రాధాన్యంఇవ్వాలి. ఉద్యోగం పొందారా? స్వయం ఉపాధిలోకి వెళ్లారా? ఎంత కాలం ఉద్యోగంలో కొనసాగారు? వారి వేతనం ఎంత? యజమాను లు వారి నైపుణ్యంపై సంతృప్తిగా ఉన్నారా? విద్యార్థులు తమ రంగంలో తదుపరిస్థాయి విద్యకు వెళ్లగలుగుతు న్నారా? వంటి ఫలితాలను కొలవాలి. ప్రతి విశ్వవిద్యాల యం తన ప్లేస్మెంట్ గణాంకాలను మాత్రమే కాకుండా, ఉద్యోగ నిలకడ, వేతన స్థాయి, పరిశ్రమ అభిప్రాయంవంటి సూచికలను కూడా వెల్లడించే విధానం తీసుకురావాలి. ఇక ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీల విషయంలో నాణ్యత అందు బాటు అనే రెండు అంశాలను సమతుల్యం చేయడం చాలా ముఖ్యం. ప్రైవేట్ పెట్టుబడికి అవకాశం కల్పించడం వల్ల కొత్త మౌలిక వసతులు, ఆధునిక పరికరాలు, పరిశ్రమ భాగస్వామ్యాలు, అంతర్జాతీయ సహకారాలు రావచ్చు. కానీ ‘స్కిల్’ అనే పేరుతో సాధారణ డిగ్రీలకు కొత్త పేర్లు పెట్టి అదే పాత బోధనా విధానాన్ని కొనసాగించే పరిస్థితి రాకూ డదు. విశ్వవిద్యాలయానికి అవసరమైన పరిశ్రమ భాగస్వా మ్యాలు వాస్తవమైనవేనా? శిక్షణా పరికరాలు అందుబాటు లో ఉన్నాయా? అధ్యాపకులు, ట్రైనర్లు తగిన అనుభవం కలిగి ఉ న్నారా? అప్రెంటిస్ట్రిప్ నిజంగా జరుగుతోందా? ప్లేస్మెంట్ వివరాలు ధృవీకరించదగినవేనా? వంటి అంశా లపై నిరంతర పర్యవేక్షణ అవసరం. అందుబాటు విష యం లోనూ స్పష్టమైన దృష్టి అవసరం.

Education that creates jobs
Education that creates jobs

ఉద్యోగాలను సృ ష్టించే స్థాయికి

స్కిల్ యూనివర్సిటీలు కేవలం అధిక ఫీజులు చెల్లించగల విద్యార్థులకే అందుబాటు లో ఉంటే వాటి సామాజిక ప్రయోజనం పరిమితమవుతుంది. ప్రతిపాదిత వ్యవస్థలో ప్రభుత్వ కోటా సీట్లకు సంబం ధించిన విధానం, ఫీజు పారదర్శకత, పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు అవకాశాలు వంటి అంశాలు కీల కం. గ్రామీణ విద్యార్థులు నగర విద్యార్థులతో సమానంగా ఆధునిక పరికరాలు, శిక్షణ, పరిశ్రమ అనుభవం పొందేలా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. స్కిల్ యూనివర్సి టీని ఉద్యోగాల కోసం మాత్రమే పనిచేసే సంస్థగా కూడా చూడ కూడదు. భవిష్యత్తు నైపుణ్య విద్యలో పరిశోధన, ఆవిష్క రణ, స్టార్టప్లు, వ్యవస్థాపకతకు కూడా స్థానం ఉండాలి. ఒక విద్యార్థి ఉద్యోగం పొందడమే కాకుండా ఉద్యోగాలను సృ ష్టించే స్థాయికి ఎదగాలి. పరిశ్రమ సమస్యలను విశ్వవిద్యా లయంలో పరిశోధనా ప్రాజెక్టులుగా తీసుకోవడం, విద్యా ర్థుల స్టార్టప్లకు ఇంక్యుబేషన్ అందించడం, స్థానిక సమస్య లకు సాంకేతిక పరిష్కారాలు అభివృద్ధి చేయడం వంటి అంశాలు స్కిల్ యూనివర్సిటీలను ఇతర సంస్థల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టగలవు. మరో ముఖ్యమైన అంశం జీవి తాంతం నేర్చుకునే విద్య. ఒక విద్యార్థి 18 లేదా 20 ఏళ్ల వయసులో పొందిన నైపుణ్యం అతని 40వ ఏటా కూడా అదే విలువను కలిగి ఉండకపోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం మారుతున్న కొద్దీ ఉద్యోగాల్లో కొత్త నైపుణ్యాలు అవసరమవు తాయి. అందుకే స్కిల్ యూనివర్సిటీలు కేవలం ఫుల్టైమ్ విద్యార్థుల కోసం కాకుండా ఉద్యోగులు, పరిశ్రమ సిబ్బంది. స్వయం ఉపాధి పొందేవారు, మధ్యలో చదువు ఆపినవారు, కొత్త రంగంలోకి మారాలనుకునేవారు వంటి వర్గాలకుకూడా రీస్కిల్లింగ్, అపిస్కిల్లింగ్ అవకాశాలను అందించాలి. సర్టిఫి కెట్, డిప్లొమా, డిగ్రీ, మైక్రోక్రెడెన్షియల్, క్రెడిట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు ఈ మార్పుకు తోడ్పడగలవు.

-ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

‘మహాలక్ష్మి’ ప్రయాణాలు ఆల్ టైమ్ రికార్డ్ – RTC MD
⬇ Full News JPG⬇ Short News JPG
← రైతు భరోసాకు డ్రోన్ టెక్నాలజీఅమరావతిలో FRRO కార్యాలయం.. విదేశీయుల సేవలకు కీలక ముందడుగు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com