Drone Technology : వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం వేగం పుంజుకుంటోంది. పంటలకు పురుగుమందులు, ద్రవ ఎరువులు పిచికారీతో పాటు పంటల పర్య వేక్షణ, వ్యవసాయ సేవలను వేగంగా అందించడంలో డ్రోన్ల విని యోగం విస్తరిస్తోంది. రైతులకు డ్రోన్ సేవలు అందుబాటు లోకి తీసుకురావడంతోపాటు గ్రామీణ మహిళలు, యువత కు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కేంద్ర ప్రభు త్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. కేంద్ర వ్యవ సాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, కిసాన్ డ్రోన్ల ప్రోత్సాహానికి ఇప్పటివరకు రూ.141.39 కోట్లు విడుదల య్యాయి. రైతులకు 527 డ్రోన్లు అందించడంతో పాటు 1,595 డ్రోన్ కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రైతుల పొలాల్లో 27,099 డ్రోన్ ప్రదర్శనలు నిర్వహించి, సుమారు 30.23 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రదర్శనలు చేపట్టగా, 3.51 లక్షల మంది రైతులు వాటి ద్వారా లబ్ధి పొందారు. డ్రోన్ వినియోగానికి సంబంధించి 287 మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. తెలం గాణలో గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగానికి పరిశోధన, ప్రయోగాల ద్వారా పునాది పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాల యానికి 2021లో డిజిసిఏ అనుమతులు లభించడంతో పంట రక్షణ, పురుగుమందుల పిచికారీ, తెగుళ్లు వ్యాధుల గుర్తింపుపై డ్రోన్లతో పరిశోధనలు జరిగాయి.
Read Also : Jurala Project Water Release: ఎట్టకేలకు జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల

Drone Technology : ఆధునిక వ్యవసాయ సాంకేతికత
2022లో వరి పంటలో డ్రోన్ ఆధారిత పిచికారీకి ప్రామాణిక విధానం రూపొందించగా, అనంతరం వరి, పత్తి, కంది, వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, కుసుమ వంటి ఏడు పంటలకు పంటనిర్దిష్ట డ్రోన్ పిచికారీ విధానాలు అభివృద్ధి చేసినట్లు రిచ్ నివేదిక పేర్కొంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం, పి జెటిఎస్ఏయూ రిచ్, అగ్రిటెక్ స్టార్టప్ల భాగస్వామ్యంతో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను పొలాల్లో పరీక్షించే కార్యక్రమాలు చేపట్టాయి. డ్రోన్ టెక్నాలజీతో పాటు వంట పర్యవేక్షణ, నీటి నిర్వహణ, పోషక యాజమాన్యం వంటి అంశాల్లోనూ సాంకేతిక పరిష్కారాలను పరీక్షించారు. ఈ చర్యల ద్వారా తెలంగాణలో డ్రోన్ ఆధారిత వ్యవసాయా నికి పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, ప్రయోగాల స్థాయిలో పునాది ఏర్పడింది. భవిష్యత్తులో ఈ సాంకేతికతను రైతులకు మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురా వడం వ్యవసాయ యాంత్రీకరణలో కీలకంగా మారనుంది. డ్రోన్ టెక్నాలజీని గ్రామీణ మహిళల ఆర్ధిక సాధికారతతో అనుసంధానించేందుకు నమో డ్రోన్ దీదీ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. 2023-24 నుంచి 2025- 26 వరకు అమలయ్యే ఈ పథకానికి రూ.1,261 కోట్ల కేటాయింపు తో ఎంపిక చేసిన మహిళా స్వయం సహాయకసంఘాలకు 15,000 డ్రోన్లు అందించాలన్నది లక్ష్యం. ఈ సంఘాలు రైతులకు అద్దె ప్రాతిపదికన డ్రోన్ సేవలను అందించేలా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద డ్రోన్ ఖర్చు లో 80 శాతం వరకు, గరిష్టంగా రూ.8 లక్షల వరకు కేంద్ర ఆర్ధిక సహాయం అందుతోంది. డ్రోన్తో పాటు స్ప్రే అసెంబ్లీ, అదనపు బ్యాటరీలు, నిర్వహణ, బీమా, డ్రోన్ పైలట్ సహాయకుడి శిక్షణ వంటి సదుపాయాలను ప్యాకేజీ లో చేర్చారు. భవిష్యత్తులో వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికతకు మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. రైతులకు డ్రోన్ సేవలు సులభంగా, తకు 2వ ఖర్చుతో అందుబాటులోకి వస్తే వ్యవసాయ యాంత్రీకరణకు మరింత ఊతం లభించే అవకాశముంది.
-డా. మోటె చిరంజీవి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
రైతులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ మొదటి వారం నుంచే వడ్ల కొనుగోళ్లు






