AP Heavy Rains: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలు, ముందస్తు ప్రాణ నష్ట నివారణ మార్గాలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
Read Also : AP Liquor Shops Lottery: ఏపీలో మద్యం దుకాణాల లాటరీ షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీలు ఇవే!

AP Heavy Rains: అశ్రద్ధ వహిస్తే ఉపేక్షించేది లేదు.. అధికారులకు హెచ్చరిక
వాతావరణం పూర్తిగా అనుకూలించి వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు ఏ ఒక్క అధికారి కూడా విధుల్లో అశ్రద్ధ వహించకూడదని ముఖ్యమంత్రి సూచించారు. జలాశయాలు, నదుల్లో పెరుగుతున్న నీటిమట్టాలను, ఇన్-ఫ్లోలను ప్రతిక్షణం సమీక్షించాలని స్పష్టం చేశారు. ప్రమాదకర పరిస్థితులు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులకు తేల్చి చెప్పారు.
బాధితులకు మెరుగైన సాయం, రైతులకు భరోసా
వరద ముంపునకు గురైన బాధితులకు నాణ్యమైన ఆహారం, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలు మరియు మందులు నిరంతరం అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఈదురు గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగితే తక్షణమే పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టంపై కచ్చితమైన అంచనాలు రూపొందించాలని, నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు






