The Paradise Movie: ‘దసరా’ వంటి భారీ విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ఈరోజు (సెప్టెంబర్ 24న) ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. షికాంజ మాలిక్ (మోహన్ బాబు) గుప్పిట్లో నలిగిపోయే సవారీల జాతికి గుర్తింపు తెచ్చేందుకు సమ్మక్క (సోనాలి కులకర్ణి) పోరాడుతుంటుంది. మాలిక్ కుట్రల వల్ల చిన్నతనంలోనే తన తల్లిని తప్పుగా అర్థం చేసుకుని, పగతో రగిలిపోయే జడల్ (నాని) చిన్న వయసులోనే జైలుకు వెళ్తాడు. జైలు నుంచి తిరిగి వచ్చాక, మాలిక్ కుమారుడు విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయాల్) సామ్రాజ్యాన్ని ఎదురించి తన జాతికి గుర్తింపు ఎలా తెచ్చాడు? తన తల్లి ప్రేమను ఎలా అర్థం చేసుకున్నాడనేదే ‘ది ప్యారడైజ్’ ప్రధాన కథ.
Read Also : The Paradise : ‘ప్యారడైజ్’కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది -నిర్మాత రవిశంకర్

The Paradise Movie: విశ్లేషణ.. మాస్ ఎలివేషన్లు, అద్భుతమైన యాక్షన్ సీన్స్
కథపరంగా చూస్తే గుర్తింపు కోసం ఓ సమూహం చేసే పోరాటం పాతదే అయినప్పటికీ, శ్రీకాంత్ ఓదెల తన స్క్రీన్‌ప్లే, క్యారెక్టరైజేషన్లతో కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్‌లోని జైల్ ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తాయి. సెకండాఫ్‌లో మోహన్ బాబు విలనిజం, నాని వినాశకరమైన యాక్షన్ మోడ్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తాయి. అయితే మధ్యలో వచ్చే హీరోయిన్ ట్రాక్, కొన్ని సాదాసీదా సన్నివేశాలు, తెలంగాణ యాసలో నాని సంభాషణలు అంతగా పండకపోవడం చిన్నపాటి లోపాలు. అయినప్పటికీ, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్, మదర్ సెంటిమెంట్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి.
నటీనటుల నటన & సాంకేతిక విభాగం
నాని తన మాస్ అవతారంతో బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను కట్టిపడేసాడు. షికాంజ మాలిక్‌గా మోహన్ బాబు ఈ తరానికి తన నటనాతేజం ఏంటో చూపిస్తూ విశ్వరూపం ప్రదర్శించారు. హీరోయిన్ కయాదు లోహర్ అందంగా కనిపిస్తూనే క్లైమాక్స్ ఫైట్‌లో మెప్పించింది. రాఘవ్ జుయాల్, సోనాలి కులకర్ణి, ప్రియదర్శి, సంపూర్ణేశ్ బాబు తమ పాత్రల మేరకు రాణించారు. సాంకేతికంగా అనిరుధ్ నేపథ్య సంగీతం థియేటర్లను ఊపేసింది. బోయాపాటి సినిమాలను మించిన లెవెల్లో ఉన్న ఫైట్ సీక్వెన్సులు మాస్ ఆడియెన్స్‌కి పండగ లాంటి అనుభూతిని ఇస్తాయి.
చివరిగా
‘ది ప్యారడైజ్’ నాని అభిమానులకు, మాస్ ప్రియులకు తృప్తినిచ్చే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్!
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
నాని ‘ది ప్యారడైజ్’.. కేసీఆర్ పాత్రలో ఆకట్టుకున్న ప్రియదర్శి






